newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

ఇంగ్లండ్ తో చివరి రెండు టెస్టులకు భారతజట్టు ప్రకటన

17-02-202117-02-2021 17:18:27 IST
2021-02-17T11:48:27.172Z17-02-2021 2021-02-17T11:48:22.658Z - - 27-02-2021

ఇంగ్లండ్ తో చివరి రెండు టెస్టులకు భారతజట్టు ప్రకటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇంగ్లండ్ తో సిరీస్ మంచి రసపట్టులో ఉన్న సంగతి తెలిసిందే..! మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం భారత్ ఇంగ్లండ్ కు ధీటుగా సమాధానం చెప్పింది. ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉండగా.. మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ లను కూడా గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలని భారత్ భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ తో జరగనున్న చివరి రెండు టెస్టుల్లో ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి రెండు టెస్టులు ఆడిన జట్టునే చివరి రెండు టెస్టులకు కొనసాగించింది.  ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ను మాత్రమే జట్టు నుంచి తప్పించారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో పేసర్ ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తాడని.. ఉమేశ్ కి మెడికల్ టీమ్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. చివరి రెండు టెస్టులు అహ్మదాబాద్ లోనే జరగనున్నాయి. 

చివరి రెండు టెస్టులకు భారతజట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.

విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు శార్దూల్ ను జట్టు నుంచి విడుదల చేశారు. స్టాండ్ బై ప్లేయర్లు అభిమన్యు ఈశ్వరన్, షహబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచాల్ లను కూడా విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేశారు. చివరి టెస్టులకు నెట్ బౌలర్లుగా అంకిత్ రాజ్ పుత్, అవీశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరవ్ కుమార్ లను ఎంపిక చేశారు. స్టాండ్ బై ప్లేయర్లుగా కేఎస్ భరత్, రాహుల్ చాహర్ లను తీసుకున్నారు.

యూసుఫ్ పఠాన్, వినయ్ కుమార్ ల రిటైర్మెంట్ ప్రకటనలు..!

యూసుఫ్ పఠాన్, వినయ్ కుమార్ ల రిటైర్మెంట్ ప్రకటనలు..!

   13 hours ago


ధోని రికార్డును అధిగమించిన కోహ్లీ..!

ధోని రికార్డును అధిగమించిన కోహ్లీ..!

   26-02-2021


INDvsENG ఇంగ్లాండ్ 81కి ఆలౌట్.. విజయానికి 49 పరుగుల దూరంలో భారత్

INDvsENG ఇంగ్లాండ్ 81కి ఆలౌట్.. విజయానికి 49 పరుగుల దూరంలో భారత్

   25-02-2021


INDvsENG: 145 పరుగులకు భారత్ ఆలౌట్.. రూట్ అద్భుతమైన స్పెల్

INDvsENG: 145 పరుగులకు భారత్ ఆలౌట్.. రూట్ అద్భుతమైన స్పెల్

   25-02-2021


పృథ్వీ షా డబుల్ సెంచరీ.. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ..!

పృథ్వీ షా డబుల్ సెంచరీ.. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ..!

   25-02-2021


మొన్నటి వరకూ మొతేరా.. ఇప్పుడేమో నరేంద్ర మోదీ స్టేడియం

మొన్నటి వరకూ మొతేరా.. ఇప్పుడేమో నరేంద్ర మోదీ స్టేడియం

   25-02-2021


INDvsENG: పింక్ బాల్ టెస్ట్.. జాగ్రత్తగా ఆడాల్సిందే..!

INDvsENG: పింక్ బాల్ టెస్ట్.. జాగ్రత్తగా ఆడాల్సిందే..!

   24-02-2021


టైగర్ వుడ్స్ కారు బోల్తా.. సర్జరీలు జరుగుతున్నాయి

టైగర్ వుడ్స్ కారు బోల్తా.. సర్జరీలు జరుగుతున్నాయి

   24-02-2021


ఈ ఏడాది ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం అయ్యే ఛాన్స్..?

ఈ ఏడాది ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం అయ్యే ఛాన్స్..?

   23-02-2021


పిచ్ ల గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించిన రోహిత్

పిచ్ ల గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించిన రోహిత్

   22-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle