newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

క్రికెట్ ప్రేమికులకు 2021 లో విందు భోజనమే

18-11-202018-11-2020 15:01:34 IST
Updated On 18-11-2020 15:15:19 ISTUpdated On 18-11-20202020-11-18T09:31:34.509Z18-11-2020 2020-11-18T09:30:33.815Z - 2020-11-18T09:45:19.036Z - 18-11-2020

క్రికెట్ ప్రేమికులకు 2021 లో విందు భోజనమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ లోని క్రికెట్ ప్రేమికులకు ఈ ఏడాది కరోనా కారణంగా నిరాశ ఎదురైంది. దాదాపు కొన్ని నెలల పాటూ భారత క్రికెటర్లను భారత జెర్సీలో చూడలేకపోయాము. కానీ వచ్చే ఏడాది మాత్రం ఫుల్ బిజీ షెడ్యూల్ ఉండనుంది. భారత ఆటగాళ్లు పలు మెగా టోర్నీలలో పాల్గొనడమే కాకుండా.. పలు దేశాలతో సిరీస్ లు ఆడనున్నారు. 2021లో భారత జట్టు 14 టెస్టులు, 16 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూన్‌లో ఆసియా టీ20, అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌ లలో పలు దేశాలతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఐపీఎల్‌ కూడా ఎలాగూ ఉండడంతో ఎంటర్టైన్మెంట్ కు కొదవ లేదు. 

భారత్ లో ఇంగ్లండ్‌తో  4 వన్డేలు, 4 టెస్ట్‌లు, 4 టీ20లు ఆడనుంది. జనవరి-మార్చి మధ్య జరగనున్నాయి.

ఏప్రిల్- మే మధ్య ఐపీఎల్ 2021 సీజన్ జరిగే అవకాశం ఉంది.

శ్రీలంక వేదికగా ఆ జట్టుతో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జూన్‌లో ఈ టూర్ ఉండే అవకాశం ఉంది.

జూన్-జూలై మధ్య టీ20 ఆసియాకప్ జరగనుంది. 

3 వన్డేల కోసం జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది.

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ అక్టోబర్‌లో భారత్ వేదికగా జరగనుంది.

అక్టోబర్-నవంబర్ మధ్య భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.

నవంబరు-డిసెంబరు‌లో న్యూజిలాండ్‌ భారత పర్యటనకు రానుంది. రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు జరగనున్నాయి.

డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో 3 టెస్ట్‌లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడనుంది.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle