newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

చేతులెత్తేసిన బిసిసిఐ.. టి 20 భారత్ లో కష్టం

06-06-202106-06-2021 07:08:54 IST
2021-06-06T01:38:54.136Z06-06-2021 2021-06-06T01:38:47.823Z - - 27-07-2021

చేతులెత్తేసిన బిసిసిఐ.. టి 20 భారత్ లో కష్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ ని తాము నిర్వహించలేమని ఐసీసీకి బీసీసీఐ చెప్పేసినట్లు సమాచారం. భారత్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై తమకు స్పష్టత ఇవ్వాలంటూ జూన్‌ 28 వరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఇటీవలే గడువు ఇచ్చింది. అయితే చివరి తేదీకి చాలా ముందే భారత క్రికెట్‌ బోర్డు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్‌లో కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షా 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలలతో పోలిస్తే ఇది తక్కువె అయినా మూడో వేవ్‌ గురించి గానీ... అక్టోబర్‌–నవంబర్‌లలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమని అందుకే టి20 నిర్వహన సాధ్యపడకపోవచ్చన్నది బిసిసిఐ వాదన.

అయితే ఆతిథ్య హక్కులు తమ వద్దే ఉంచుకుంటూ యూఏఈ, ఒమన్‌లలో వరల్డ్‌కప్‌ జరిపితే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఎనిమిది టీమ్‌ల ఐపీఎల్‌నే తరలించినప్పుడు 16 జట్ల ప్రపంచకప్‌ ఎలా నిర్వహిస్తాం. ప్రపంచకప్‌ అంటే ఐపీఎల్‌ లాంటిది కాదని... ఏదైనా ఒక అసోసియేట్‌ జట్టులో పొరపాటున కొందరికి కరోనా సోకితే ఇక ఆ జట్టు ఇతర ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం కూడా ఉండదని అందుకే కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న సమయంలో టి 20 ప్రపంచ కప్ నిర్వహించడం తలకు మించిన భారమని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి పరాజయం

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి పరాజయం

   14 hours ago


టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ 3 వ రౌండ్ కి చేరుకున్నాడు

టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ 3 వ రౌండ్ కి చేరుకున్నాడు

   19 hours ago


నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా

నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా

   25-07-2021


టోక్యో ఒలింపిక్స్ 2020: సుమిత్ నాగల్ 25 సంవత్సరాల తరువాత ఈ రికార్డుతో చరిత్ర సృష్టించాడు

టోక్యో ఒలింపిక్స్ 2020: సుమిత్ నాగల్ 25 సంవత్సరాల తరువాత ఈ రికార్డుతో చరిత్ర సృష్టించాడు

   24-07-2021


టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్ తరపున తొలి పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్ తరపున తొలి పతకం

   24-07-2021


4 సంవత్సరాల తర్వాత భారత్ పై శ్రీలంక వన్డే మ్యాచ్ గెలిచింది

4 సంవత్సరాల తర్వాత భారత్ పై శ్రీలంక వన్డే మ్యాచ్ గెలిచింది

   24-07-2021


అందరూ చీర్స్‌ ఫర్‌ ఇండియా చేద్దాం రండి

అందరూ చీర్స్‌ ఫర్‌ ఇండియా చేద్దాం రండి

   23-07-2021


నారప్పకి బాగానే గిట్టుబాటు అయ్యిందంట,,

నారప్పకి బాగానే గిట్టుబాటు అయ్యిందంట,,

   23-07-2021


IND vs SL: భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు

IND vs SL: భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు

   23-07-2021


చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?

చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle