newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలకు పిలుపు

21-02-202121-02-2021 16:27:10 IST
Updated On 21-02-2021 08:36:57 ISTUpdated On 21-02-20212021-02-21T10:57:10.107Z21-02-2021 2021-02-21T02:43:47.188Z - 2021-02-21T03:06:57.934Z - 21-02-2021

సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలకు పిలుపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టుకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఇందులో ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలు తొలిసారి భారత జెర్సీ వేసుకోబోతున్నారు. ముఖ్యంగా దేశవాళీ మ్యాచ్ లలో అద్భుతంగా రాణిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ను భారతజట్టులోకి తీసుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా అతడికి ఆ అదృష్టం వరించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టులో అతనికి చోటు దక్కింది. 

అహ్మదాబాద్‌లో జరిగే ఈ సిరీస్‌ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్‌లోనే రాజస్తాన్‌ తరఫున ఆకట్టుకున్న రాహుల్‌ తెవాటియాకు  కూడా తొలిసారి భారత జట్టు పిలుపు వచ్చింది. జార్ఖండ్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ కూడా తొలి సారి భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం. రిషభ్‌ పంత్‌ జట్టులో ఉన్నా, రెండో వికెట్‌ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేసింది కమిటీ.

సంజు సామ్సన్‌, మనీశ్‌ పాండే, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లను కూడా తప్పించారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకొని భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. 12 మార్చి నుంచి 20 మార్చి వరకు మొటెరా స్టేడియంలోనే ఐదు టి20లు జరుగుతాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలో 19 మందితో కూడిన జట్టును బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.   

జట్టు సభ్యులు వీరే:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

   4 hours ago


హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

   10 hours ago


మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

   a day ago


నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

   03-03-2021


అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

   02-03-2021


స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

   01-03-2021


ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

   28-02-2021


టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

   28-02-2021


ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

   28-02-2021


నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

   27-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle