newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎక్కువగా బాధపెట్టింది: డేవిడ్ వార్నర్

08-01-202208-01-2022 13:10:57 IST
2022-01-08T07:40:57.392Z08-01-2022 2022-01-08T07:40:55.038Z - - 25-05-2022

సన్‌రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎక్కువగా బాధపెట్టింది: డేవిడ్ వార్నర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్‌తో డేవిడ్ వార్నర్ పేలవమైన ఫామ్‌తో హైదరాబాద్ జట్టు నుండి కెప్టెన్‌గా, తర్వాత ప్లేయరుగా కూడా తొలగించబడ్డాడు. వార్నర్‌ని హైదరాబాద్ ఐపీఎల్ రిటెన్షన్స్‌లో కూడా ఉంచుకోలేదు, తద్వారా అతను వచ్చే సీజన్‌కు ముందు జరిగే మెగా వేలంలో భాగమయ్యాడు. 2021 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలవడానికి సహాయం చేయడంతో తన ఫామ్‌ను తిరిగి పొందిన ఈ ఓపెనర్, ఇటీవల హైదరాబాద్ నుండి తన అనాలోచిత నిష్క్రమణకు తెరతీశాడు.

'బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా' షోలో వార్నర్ మాట్లాడుతూ, మీరు కెప్టెన్‌ నుంచి తీసివేసి తర్వాత కూడా జట్టులో సభ్యునిగా కూడా తీసుకోకపోతే అది జట్టులో మిగతా సభ్యులకు ఏం సందేశం పంపుదాం అనుకుంటున్నారు. 

2016లో హైదరాబాద్ని వారి ఏకైక ఐపీఎల్ టైటిల్‌ గెలిపించిన వార్నర్ ఇలా అన్నారు: "నాకు చాలా బాధ కలిగించింది ఏమిటంటే, ఇతర కుర్రాళ్ళు ఇప్పుడు 'ఓహ్, ఇది నాకు జరగవచ్చు' అని జట్టులో ప్రతీ సభ్యుడూ ఆలోచిస్తున్నారు. నేను హైదరాబాద్ నుండి నిష్క్రమించడం జట్టు యువ అభిమానులను బాధిస్తుందని వార్నర్ చెప్పాడు.

నేను ఎక్కడ ఆడతాను అనే దానిపై నాకు మక్కువ ఉంది. అభిమానులకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు కాబట్టి అభిమానులతో ఏ విధంగానైనా కనెక్ట్ అవుతాను. సచిన్ (టెండూల్కర్), విరాట్ (కోహ్లీ), నేనే, కేన్ విలియమ్సన్ కావాలని ప్లేగ్రౌండ్‌లో ఉన్న పిల్లలు కోరుకుంటార, వారు అలాంటిది చూస్తే, అది వారికి బాధ కలిగిస్తుంది. అదే నాకు చాలా బాధ కలిగించింది, అని అతను వివరించాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle