ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
16-01-202116-01-2021 18:44:28 IST
Updated On 16-01-2021 19:01:24 ISTUpdated On 16-01-20212021-01-16T13:14:28.332Z16-01-2021 2021-01-16T13:14:02.953Z - 2021-01-16T13:31:24.335Z - 16-01-2021

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో వరుణుడు అడ్డుపడ్డాడు. రెండో రోజు ముగిసే సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ 7 పరుగులు, రోహిత్ శర్మ 44 పరుగులు వికెట్లు కోల్పోయింది భారత్. ఈ టెస్ట్ సిరీస్ లో ఆఖరి రెండు టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇస్తున్నా.. దాన్ని భారీ ఇన్నింగ్స్ గా మలచలేకపోతున్నాడు. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ మూడు ఇన్నింగ్స్ లలో అవుట్ అయిన తీరు భారత అభిమానులకు షాక్ కు గురిచేస్తోంది. రోహిత్ క్రీజులో పాతుకుపోయినట్లు ఉన్నాడు భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది అని అభిమానులు టీవీలకు అతుక్కుపోయే సమయంలో రోహిత్ చెత్త షాట్స్ ఆడి అవుట్ అవుతూ ఉన్నాడు. అబ్బా.. అద్భుతమైన బంతి.. రోహిత్ వికెట్ ను తీసుకుంది అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.. ఎందుకంటే చెత్త షాట్స్ కు రోహిత్ అవుట్ అవుతూ ఉన్నాడు కాబట్టి. గబ్బా టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. మంచి దూకుడు మీద ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ చాలా సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ ఔట్ అయిన తీరుపై విమర్శలు గుప్పించారు. రోహిత్ షాట్ సెలెక్షన్ అసలు బాగోలేదని.. టెస్ట్ మ్యాచ్ లో కూడా వికెట్లను ఇంత సులువుగా ఇచ్చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని గవాస్కర్ వ్యక్తం చేశారు. లాంగాన్ లో, స్వేర్ లెగ్ లో ఫీల్డర్లు ఉన్నప్పుడు ఆ షాట్ ఆడాలని ఎలా అనుకున్నావని రోహిత్ ను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. లయన్ బౌలింగ్ లో కాన్ఫిడెంట్ గా బౌండరీలు కొట్టిన రోహిత్ రాంగ్ షాట్ ఎలా ఆడాడో అర్థం కావడం లేదని అన్నారు. సీనియర్ ఆటగాడు అయ్యుండి అనవసరంగా వికెట్ ను సమర్పించుకున్నాడని అభిప్రాయాన్ని వెల్లడించారు గవాస్కర్. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ సందర్భంగా ప్రారంభమైన వర్షం జోరుగా కురిసింది. దీంతో మైదానం చిత్తడిగా మారింది. అప్పటికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 2 వికెట్లకు 62 పరుగులు. మైదానాన్ని ఆటకు సిద్ధం చేసేందుకు గబ్బా స్టేడియం సిబ్బంది ఎంతగా శ్రమించినా ఫలితం లేకపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి రెండో రోజు ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఓవర్ నైట్ స్కోరు 274/5తో రెండో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 369 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (50) అర్ధసెంచరీ సాధించగా, కామెరాన్ గ్రీన్ 47 పరుగులు చేశాడు. చివర్లో మిచెల్ స్టార్క్ 20 నాటౌట్, నాథన్ లైయన్ 24 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ తలో 3 వికెట్లు తీశారు. సిరాజ్ కు ఓ వికెట్ దక్కింది.

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మార్పు.. గంగూలీ చెప్పేశారు
5 hours ago

ప్రపంచంలోనే మేటి బౌలర్ బంతిని పంత్ అలా బాదేశాడే.. వాపోయిన రూట్
20 hours ago

టీమిండియా పై చస్తే బెట్ కట్టనంటున్న మైఖేల్ వాన్
08-03-2021

ఈ ఏడాది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!
07-03-2021

రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ సీరీస్‌ని మలుపు తిప్పింది.. కోహ్లీ
07-03-2021

ఏప్రిల్ 9 నుండే ఐపీఎల్ సందడి షురూ..!
07-03-2021

టీమిండియా ప్రతిభ అద్భుతం.. ఇంగ్లండ్ ఎత్తుగడలు ఘోరం... మాజీ క్రికెటర్ల వ్యాఖ్య
07-03-2021

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
06-03-2021

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
06-03-2021

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
06-03-2021
ఇంకా