newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

15-04-202115-04-2021 08:37:07 IST
2021-04-15T03:07:07.116Z15-04-2021 2021-04-15T03:07:03.658Z - - 15-05-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా మరో ఓటమిని చవి చూసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సులువుగా గెలిచే మ్యాచ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ముంబై ఇండియన్స్ ఎలా షాక్ ఇచ్చిందో.. అచ్చం అలాగే సన్ రైజర్స్ కు ఆర్సీబీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌ 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్సర్లు), కెప్టెన్‌ కోహ్లి (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో హోల్డర్‌ (3/30), రషీద్‌ ఖాన్‌ (2/18) విజృంభించడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయలేకపోయింది. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌ వార్నర్‌ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్సర్‌), మనీశ్‌ పాండే (39 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.  ఓపెనర్‌ సాహా (1) మరోసారి విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పాండే ఆచితూచి ఆడాడు. బెంగళూరు బౌలర్లు షహబాజ్‌ అహ్మద్‌ (3/7), హర్షల్‌ పటేల్‌ (2/25), సిరాజ్‌ (2/25) హైదరాబాద్‌ను దెబ్బతీశారు.  పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్‌ 50/1గా నిలిచింది. 12వ ఓవర్‌ తొలి బంతికి రెండు పరుగులు తీసిన వార్నర్‌ 31 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే 83 పరుగుల భాగస్వామ్యంతో దూసుకెళ్తున్న ఈ జోడికి జేమీసన్‌ విడదీశాడు.  

24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన దశలో హైదరాబాద్ మ్యాచ్ ను బెంగళూరు చేతిలోకి ఇచ్చేయడం మొదలుపెట్టింది. 17వ ఓవర్‌ వేయడానికి వచ్చిన షహబాజ్‌ అహ్మద్‌ తొలి రెండు బంతులకు బెయిర్‌స్టో (12), మనీశ్‌ పాండేలను అవుట్‌ చేశాడు. చివరి బంతికి సమద్‌ (0)ను డకౌట్‌ చేశాడు. ఆ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. 18వ ఓవర్‌లో శంకర్‌ (3) హర్షల్‌ పటేల్‌ ... 19వ ఓవర్‌లో హోల్డర్‌ (4)ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో రైజర్స్‌ విజయానికి 16 పరుగులు అవసరం కాగా... హర్షల్‌  వేసిన ఈ ఓవర్లో రషీద్‌ (17), భువనేశ్వర్‌ (2 నాటౌట్‌) తొలి మూడు బంతులకు 8 పరుగులు సాధించారు. అయితే వరుస బంతుల్లో రషీద్, నదీమ్‌ (0) అవుట్‌ కావడంతో రైజర్స్‌ ఓటమి ఖాయమైంది. రషీద్ ఖాన్ పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది. మ్యాక్స్ వెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle