నేను తప్పు చేయలేదు అంటున్న స్టీవ్ స్మిత్
13-01-202113-01-2021 11:07:47 IST
Updated On 13-01-2021 11:48:11 ISTUpdated On 13-01-20212021-01-13T05:37:47.197Z13-01-2021 2021-01-13T05:37:35.112Z - 2021-01-13T06:18:11.251Z - 13-01-2021

మూడో టెస్టులో చివరి రోజు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమ్ఇండియా విజయం సాధించేలా కనిపించింది. దీంతో మరో ఓటమి తప్పదని బావించిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రీజ్ దగ్గర బ్యాటింగ్ గార్డ్ మార్క్‌ను మారుస్తూ కనబడ్డాడు అంటూ.. పలువురు స్టీవ్ స్మిత్ మీద ఆరోపణలు గుప్పించారు. మూడో టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసే సమయంలో గార్డ్ మార్క్‌లను స్టీవ్ స్మిత్ పలుమార్లు మార్చేశాడు. డ్రింక్స్ బ్రేక్‌లో పంత్ గార్డ్‌ను కావాలని చెరిపేస్తూ.. స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. తన గార్డ్ చెరిపేయడంతో పంత్ మరోసారి మార్క్ చేసుకోవాల్సి వచ్చింది. ఛీటింగ్ చేశావంటూ తనపై వస్తున్న విమర్శలపై స్టీవ్ స్మిత్ స్పందించాడు. ఇందులో ఎలాంటి వివాదమే లేదని.. నేను బౌలర్ల కోసం ఇలా చేస్తూనే ఉంటానని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. ఈ ఆరోపణలతో నిర్ఘాంతపోయానని అన్నాడు స్టీవ్ స్మిత్. చాలా నిరాశ చెందానని వెల్లడించాడు. పిచ్ వద్దకు వెళ్లి మా బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎలా ఆడుతున్నారు అనేది అక్కడ నిలబడి ఒక దృశ్యాన్ని నా మదిలో ఊహించుకుంటానని.. మిడిల్ స్టంప్‌కు అనుగుణంగా ఒక మార్కింగ్ కూడా చేసుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చాడు స్మిత్. తాను కావాలని చేయలేదని.. భారత జట్టు అద్భుత ప్రదర్శన కాకుండా ఇలాంటి విషయాలకు ఎక్కువగా చర్చించడం సిగ్గు పడాల్సిన అంశమని స్మిత్ తెలిపాడు. మరో వైపు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ కూడా భారత ఆటగాళ్లకు క్షమాపణ చెప్పాడు. తన నోటికి పని చెప్పిన పైన్.. ఫీల్డ్ లో చాలా ఓవరాక్షన్ చేశాడు. అందుకే క్షమాపణలు చెప్పుకొచ్చాడు పైన్. నేనో మనిషిని, నేను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నా.. ఆస్ట్రేలియా టీమ్‌ను లీడ్ చేయడాన్ని నేను ఎప్పుడూ గర్వంగా ఫీలవుతాను.. కానీ సిడ్నీ టెస్ట్ చివరి రోజు మాత్రం అలా జరగలేదని అన్నాడు. టీమ్‌ను సరిగా లీడ్ చేయలేకపోయానని.. మ్యాచ్ తాలూకు ఒత్తిడిని అధిగమించలేపోయానని అన్నాడు. అది నా ఆటపై ప్రభావం చూపిందని.. లీడర్‌గా ఇది నాకు దారుణమైన మ్యాచ్ అని నా టీమ్ మేట్స్‌తో చెప్పానని పైన్ వెల్లడించాడు. ఐదో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా అశ్విన్‌తో తాను మాట్లాడినట్లు తెలిపాడు. నేనో ఫూల్‌గా వ్యవహరించాను కదా అని అశ్విన్‌తో తాను చెప్పానని పైన్ వెల్లడించాడు.

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్
7 hours ago

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
8 hours ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
15 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021
ఇంకా