newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

చేజేతులా చేసుకున్న హైదరాబాద్

25-10-202025-10-2020 08:46:46 IST
Updated On 25-10-2020 08:52:43 ISTUpdated On 25-10-20202020-10-25T03:16:46.338Z25-10-2020 2020-10-25T03:16:37.284Z - 2020-10-25T03:22:43.810Z - 25-10-2020

చేజేతులా చేసుకున్న హైదరాబాద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
127 పరుగుల లక్ష్యం.. 100 పరుగులకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయింది. మరో 24 బంతుల్లో 27 పరుగులు చేయాలి అంతే.. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిని చేజేతులా కొనితెచ్చుకుంది. ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలను తన కాలితే తానే తన్నేసినట్లు అనిపించింది సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి 7 వికెట్లనూ 3.5 పరుగుల తేడాతో కోల్పోయి, 14 పరుగులు మాత్రమే చేసి, 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 126 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లు పంజాబ్ ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. పూరన్ చేసిన 32 పరుగులు మినహా పెద్దగా రాణించకపోవడంతో భారీ హిట్టర్లు ఉన్న పంజాబ్ జట్టు చాలా తక్కువ పరుగులే చేసింది. రషీద్, హోల్డర్, సందీప్ లు తలా 2 వికెట్లు తీశారు. పంజాబ్ 120 బంతుల ఇన్నింగ్స్‌లో ఒకదశలో వరుసగా 75 బంతుల పాటు (12.3 ఓవర్లు) బ్యాట్స్‌మెన్‌ ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు. హోల్డర్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి గేల్‌ ఫోర్‌ కొట్టగా... ఖలీల్‌ వేసిన 19వ ఓవర్‌ మూడో బంతికి పూరన్‌ ఫోర్‌ కొట్టాడు.

127 పరుగుల లక్ష్యంతో దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో శుభారంభాన్ని అందించారు. 35 పరుగులు చేసిన వార్నర్, 19 పరుగులు చేసిన బెయిర్ స్టో అవుట్ అయిన తరువాత పాండే 15, సమద్ 7, శంకర్ 26 పరుగులకు అవుట్ అయ్యారు. 17వ ఓవర్ వేసిన జోర్డాన్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేలా తొలి బంతికే పాండేను పెవీలియన్ పంపాడు. ఆ తరువాతి ఓవర్లో శంకర్ అవుట్ చేయగా 19వ ఓవర్ లో రెండు, 20వ ఓవర్ లో మూడు వికెట్లను కోల్పోయిన సన్ రైజర్స్ ఓటమిని చవి చూసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ జోర్డాన్‌ (3/17), అర్ష్దీప్‌ సింగ్‌ (3/23) పంజాబ్‌ కు గెలుపును అందించారు. 

 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   11 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   15 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle