newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!

18-04-202118-04-2021 08:33:06 IST
2021-04-18T03:03:06.711Z18-04-2021 2021-04-18T03:03:03.305Z - - 15-05-2021

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి అభిమానులల్లో బాధనే నింపింది. ఈ సీజన్ లో వరుసగా మూడో మ్యాచ్ లో కూడా ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. మిడిలార్డర్ వీక్ అని అంటూనే ఉన్నా కూడా.. అదే మిడిలార్డరే మరోసారి సన్ రైజర్స్ కొంప ముంచింది. మరీ భారీ స్కోరు కాకపోయినా.. రన్ రేట్ కొండంత లేకపోయినా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ చేతులెత్తేసింది. స్టార్ బౌలింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ చేతిలో 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఓటమిని చవిచూసింది. 

మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (39 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్, విజయ్‌ శంకర్‌ చెరో 2 వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. బెయిర్‌స్టో (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించినప్పటికీ.. రాహుల్‌ చహర్‌ (3/19) స్పిన్‌ , బౌల్ట్‌ (3/28)‌ ముంబైని విజేతగా నిలబెట్టాయి.

151 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. బెయిర్ స్టో 22 బంతుల్లో 43 పరుగులు, కెప్టెన్ వార్నర్ 34 బంతుల్లో 36, విజయ్ శంకర్ 25 బంతుల్లో 28 పరుగులు చేశారు. మనీశ్ పాండే 2, విరాట్ సింగ్ 11, అభిషేక్ 7, రషీద్ ఖాన్ 0, భువనేశ్వర్ 1, ఖలీల్ అహ్మద్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. సన్ రైజర్స్ చివరి 7 వికెట్లూ 36 పరుగుల తేడాలోనే కోల్పోయింది. విజయ్ శంకర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి విజయంపై ఆశలు రేపినప్పటికీ సన్ రైజర్స్ ఓటమి నుండి మాత్రం తప్పించలేకపోయాడు. సన్ రైజర్స్ మిడిలార్డర్ మారాల్సిందేనని అంటున్నారు అభిమానులు. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle