newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

గంగూలీ ఐసీసీ పదవి వద్దనుకున్నాడా..?

19-10-202019-10-2020 12:28:11 IST
Updated On 19-10-2020 12:48:31 ISTUpdated On 19-10-20202020-10-19T06:58:11.476Z19-10-2020 2020-10-19T06:58:06.029Z - 2020-10-19T07:18:31.949Z - 19-10-2020

గంగూలీ ఐసీసీ పదవి వద్దనుకున్నాడా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న క్రికెట్ బోర్డు ఏమిటంటే భారత్ అనే చెబుతారు. ఐసీసీలో కూడా భారత్ కీలక పాత్రను పోషిస్తోంది. డిసెంబర్ లో ఐసీసీకి కొత్త అధ్యక్షుడు రావాల్సి ఉండగా.. ఆ అధ్యక్షుడు భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కథనాలు వచ్చాయి. అతడే సమర్థుడని చాలా క్రికెట్ బోర్డుకు చెందిన పెద్దలు, పలువురు మాజీ క్రికెటర్లు కూడా చెప్పారు. కానీ గంగూలీ ఐసీసీ పదవిని వద్దని అనుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భారత్ కు చెందిన ఏ వ్యక్తి కూడా ఐసీసీ అధ్యక్ష పీఠం కావాలని కోరుకోలేదని అర్థమవుతోంది.   

బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీ, ప్రస్తుతానికి ఐసీసీ బాధ్యతలను స్వీకరించాలని భావించడం లేదు. ఇటీవల ఐసీసీ అధ్యక్ష పీఠం నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోగా..  ఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 18వ తేదీ ఆఖరి రోజు కాగా.. ఆ గడువు ముగిసింది. కానీ  గంగూలీ నామినేషన్ వేయలేదు. బీసీసీఐ నుంచి మరే ఇతర వ్యక్తులు కూడా ఈ పోటీలో లేరని ఐసీసీ వెల్లడించింది. నామినేషన్లను స్క్రూటినీ చేసిన అనంతరం, డిసెంబర్ లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. గంగూలీ ప్రస్తుతానికి ఆ బాధ్యతలు తనకు వద్దని, భవిష్యత్తులో ఐసీసీపై దృష్టిని సారించవచ్చనే  పోటీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతానికి గంగూలీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఐపీఎల్ సీజన్ ను అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు బయలుదేరనుంది. తొలి టెస్ట్ పింక్ బాల్ తో అడిలైడ్ లో డే అండ్ నైట్ టెస్ట్ గా జరుగుతుందని గంగూలీ ప్రకటించారు. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య నవంబర్ నుండి మూడు టీ-20లతో పాటు మూడు వన్డేలు, నాలుగు టెస్టులు జరుగనున్నాయి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle