newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

ఐపీఎల్ అందుకే 'ది బెస్ట్' అంటున్న గంగూలీ

28-09-202028-09-2020 11:27:29 IST
Updated On 28-09-2020 11:30:33 ISTUpdated On 28-09-20202020-09-28T05:57:29.981Z28-09-2020 2020-09-28T05:57:22.275Z - 2020-09-28T06:00:33.687Z - 28-09-2020

ఐపీఎల్ అందుకే 'ది బెస్ట్' అంటున్న గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్ ఎన్నో ట్విస్టులతో సాగిన సంగతి తెలిసిందే..! 224 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ మ్యాచ్ ను ఊహించని స్థాయిలో ముగించేసింది. షార్జా స్టేడియంలో అసలైన సిక్సర్ల వర్షాన్ని చూశారు. మ‌రో 3 బంతులు మిగిలి ఉండ‌గానే రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్పందించారు.  ఇదో అద్భుత మ్యాచ్ అని, అందుకే ప్ర‌పంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్ అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఆట‌గాళ్లు అత్యుద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారని అన్నారు. 

ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్ లు ఉన్నాయి. కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క క్రికెటర్ ఐపీఎల్ ఆడితే చాలు అని అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా కొన్ని మ్యాచ్ లు కూడా ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. పంజాబ్‌, రాజ‌స్థాన్ మ్యాచ్‌ కూడా అలాంటిదే..! బ్యాట్స్‌మెన్ మొత్తం 34 ఫోర్లు, 29 సిక్స‌ర్లు బాదారు.  పంజాబ్ బ్యాట్స్‌మెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 107 ర‌న్స్ చేయ‌గా.. రాజ‌స్థాన్ జ‌ట్టులో స్మిత్‌, తెవాటియా, శాంస‌న్‌లు హాఫ్ సెంచ‌రీల‌తో విజయానికి బాటలు వేశారు. రాహుల్ తెవాటియా ఇన్నింగ్స్ మ్యాచ్ కు హైలైట్ గా నిలిచింది. 

3 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్‌ సంచలన విజయం సాధించింది. 224 పరుగులు లక్ష్యాన్ని కూడా రాజస్తాన్ రాయల్స్ అద్భుత ఆటతీరులో సాధించింది. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో అత్యంత నాటకీయంగా సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ.. చివరకు రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ రాహుల్‌ తెవాటియా (31 బంతుల్లో 7 సిక్సర్లతో 53) ఆఖర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle