newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ ను వాయిదా వేసే అవకాశమే లేదు: సౌరవ్ గంగూలీ

05-04-202105-04-2021 22:14:57 IST
Updated On 05-04-2021 11:57:12 ISTUpdated On 05-04-20212021-04-05T16:44:57.824Z05-04-2021 2021-04-05T05:55:28.950Z - 2021-04-05T06:27:12.765Z - 05-04-2021

ఐపీఎల్ ను వాయిదా వేసే అవకాశమే లేదు: సౌరవ్ గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ సీజన్-14 ఏప్రిల్ 9 నుండి మొదలు కాబోతోంది. ఇలాంటి సమయంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడం.. పలు ఆటగాళ్లు కరోనా బారిన పడుతూ ఉండడంతో ఐపీఎల్ వాయిదా పడుతుందేమోనని అభిమానులు భయపడుతూ ఉన్నారు. అయితే అలాంటి అవకాశమే లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తేల్చి చెప్పారు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని‌ గంగూలీ అన్నారు. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు కఠిన ఆంక్షల్ని ప్రకటించిన నేపథ్యంలో లీగ్‌ నిర్వహణపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన గంగూలీ ఐపీఎల్‌ నిర్వహణ యథాతథంగా జరుగుతుందని తెలిపారు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 10-25 మధ్య ముంబయిలో 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లు ముంబయిలోనే సాధన చేస్తున్నాయి. పలువురు ఆటగాళ్లు, మైదానం సిబ్బంది కరోనా బారినపడడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా వంటి ఆటగాళ్లు కరోనా బాధితుల జాబితాలో చేరారు. నితీశ్ రాణా ఇప్పటికే కోలుకున్నాడు.

దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఐపీఎల్ సజావుగా సాగుతుందా లేదా అనే భయాలు వెంటాడుతూ ఉన్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్‌ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్‌ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన మొదలైంది. ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్‌ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్‌ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. స్టాండ్‌బై స్టేడియాలలో హైదరాబాద్‌ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్‌ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle