newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

27-11-202027-11-2020 13:44:42 IST
Updated On 27-11-2020 13:53:29 ISTUpdated On 27-11-20202020-11-27T08:14:42.739Z27-11-2020 2020-11-27T08:14:39.593Z - 2020-11-27T08:23:29.399Z - 27-11-2020

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిడ్నీ వేదికగా జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు పోటీప‌డి మ‌రీ ప‌రుగులు సాధించారు. ముఖ్యంగా కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్స‌ర్లు), స్టీవ్ స్మిత్( 105 ;66 బంతుల్లో 11 పోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కాలతో చెల‌రేగ‌గా.. డేవిడ్ వార్న‌ర్‌( 69; 76 బంతుల్లో 6 పోర్లు) అర్థ‌శ‌తకంతో రాణించ‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆసీస్ 6 వికెట్ల న‌ష్టానికి 374 ప‌రుగుల భారీ స్కోర్‌ చేసింది.  

ముందుగా టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ పించ్ మ‌రో ఆలోచ‌నకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌ పిచ్‌పై కంగారూ  ఓపెన‌ర్లు ఫించ్‌, వార్న‌ర్ లు అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చారు.  మొద‌ట ఆచితూచి ఆడిన ఈ జోడి.. త‌రువాత త‌మ బ్యాట్ల‌కు ప‌ని చెప్పారు. ముఖ్యంగా ఫించ్ ప్ర‌తి బంతిని బౌండ‌రీ దాటించాలి అన్న క‌సితో బ్యాటింగ్ చేశాడు. తొలి వికెట్ కు 156 ప‌రుగులు జోడించిన అనంత‌రం వార్న‌ర్‌ను ష‌మీ వెన‌క్కు పంపాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన స్మిత్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. రెండో వికెట్‌కు వీరిద్ద‌రు  108 ప‌రుగులు జోడించి జ‌ట్టును ప‌టిష్ట స్థితిలో నిలిపారు. శ‌త‌కం సాధించి మంచి ఊపులో ఉన్న ఫించ్‌ను బుమ్రా వెన‌క్కి పంప‌గా.. ఆడిన మొద‌టి బంతికే స్టొయినిస్‌ను చాహ‌ల్ ఔట్ చేయాడు. దీంతో వెంట వెంట‌నే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వ‌న్డేలో బోణి కొట్టేదెవ‌రో..?

ఈ ద‌శ‌లో భార‌త బౌల‌ర్లు పుంజుకుంటార‌ని బావించ‌గా.. అభిమానుల ఆశ‌ల‌పై మాక్స్‌వెల్ నీళ్లు చ‌ల్లాడు. వ‌చ్చి రావ‌డంతోనే బౌండ‌రీల‌తో విరుచుప‌డ్డాడు. 19 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్స‌ర్లు సాయంతో 45 ప‌రుగులు చేశాడు. చివ‌ర్లో బార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో.. ఆసీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 374 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు తీయ‌గా.. బుమ్రా, చాహ‌ల్‌, సైనీ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.  భార‌త్ విజ‌యం సాధించాలంటే.. 375 ప‌రుగులు చేయాలి. 

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

   3 hours ago


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

   7 hours ago


గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

   10 hours ago


ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

   8 hours ago


ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

   27-01-2021


మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

   26-01-2021


కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

   25-01-2021


టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

   25-01-2021


ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

   24-01-2021


ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

   24-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle