newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

మొన్న రషీద్ ఖాన్ విషయంలో.. ఇప్పుడు గిల్ విషయంలో.. ఏంటిది గూగుల్

15-10-202015-10-2020 21:47:13 IST
Updated On 17-10-2020 15:27:14 ISTUpdated On 17-10-20202020-10-15T16:17:13.438Z15-10-2020 2020-10-15T16:17:09.174Z - 2020-10-17T09:57:14.660Z - 17-10-2020

మొన్న రషీద్ ఖాన్ విషయంలో.. ఇప్పుడు గిల్ విషయంలో.. ఏంటిది గూగుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రషీద్ ఖాన్ భార్య ఎవరు అంటే అనుష్క శర్మను గూగుల్ చూపించిన సంగతి తెలిసిందే..! ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ కు ఇంకా పెళ్లి అవ్వలేదు. కానీ గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అని సెర్చ్ చేస్తుంటే మాత్రం అనుష్క శర్మ అని చెబుతోంది. 22 ఏళ్ల రషీద్‌ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అంటే కోహ్లీ సతీమణి పేరు ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. రషీద్ ఖాన్ 2018లో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లతో మాట్లాడుతూ తన ఫేవరెట్‌ హీరోయిన్లు‌ అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. రషీద్‌ ఖాన్‌ ఫేవరెట్‌ ‘అనుష్క శర్మ’ అని వార్తలు వచ్చాయి. కానీ గూగుల్ సెర్చ్ లో మాత్రం రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అని చూపిస్తోంది.

తాజాగా మరో యువ క్రికెటర్ శుభమన్ గిల్ విషయంలో కూడా గూగుల్ అలాగే చూపిస్తోంది.  సచిన్ కుమార్తె 'సారా టెండూల్కర్' గిల్ భార్య అని చూపిస్తూ ఉండడంతో అందరూ షాక్ అవుతూ ఉన్నారు. గతంలో శుభమన్‌గిల్, సారా డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు క్రికెటర్‌ శుభమన్‌గిల్‌ భార్య ఎవరు? అని గూగుల్‌లో సెర్చ్‌ చేయగా.. సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ అని చూపిస్తోంది. శుభమాన్ ‌గిల్ ఐపీఎల్ లో మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. సచిన్ కూడా గిల్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా గిల్, సారా డేటింగ్ లో ఉన్నారనే హింట్స్ కూడా ఇస్తున్నారేమోనని నెటిజన్లు చెబుతూ వస్తున్నారు. కానీ గూగుల్ లో ఏకంగా భార్య అని చూపిస్తూ ఉంది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle