శుభమన్ గిల్ తండ్రి బాధ అదొక్కటే.. సెహ్వాగ్ కౌంటర్..!
20-01-202120-01-2021 20:49:58 IST
Updated On 20-01-2021 18:16:08 ISTUpdated On 20-01-20212021-01-20T15:19:58.352Z20-01-2021 2021-01-20T12:09:24.199Z - 2021-01-20T12:46:08.596Z - 20-01-2021

ఆస్ట్రేలియా గడ్డ మీద భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. భారతజట్టు 2-1తో చరిత్ర సృష్టించడం పట్ల అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. యువ ఆటగాడు శుభమన్ గిల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ విజయావకాశాలు పెరిగిపోయాయి. ఆసీస్ విధించిన 328 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి చేధించింది. రిషబ్ పంత్ 89 పరుగులతో నాటౌట్ గా నిలవగా.. పంత్‌కు తోడుగా పుజారా వికెట్లు కోల్పోకుండా అడ్డుకున్నాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. 91 పరుగులు చేసి భారత విజయానికి బాటలు పరిచాడు. 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు గిల్. తన కుమారుడి సెంచరీని మిస్ అవ్వడంపై గిల్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా క్రికెట్ చరిత్రలో కొన్ని ఏళ్ల పాటు గర్తుండిపోతుందని.. నా కొడుకు ఇన్నింగ్స్ నాకు ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. అయితే సెంచరీగా మలిచి ఉంటే ఇంకా బాగుండేదని అన్నారు. 91 పరుగుల వరకు వచ్చి కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోవడం కాస్త బాధ కలిగించిందని.. అయినా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే చిరస్మరణీయ విజయంలో నా కుమారుడు భాగస్వామ్యం కావడం ఆ బాధను మరిచేలా చేసిందని గర్వంగా చెప్పుకొచ్చారు. గిల్ ఔటైన విధానం తనను కలవరపరిచిందని.. అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని టచ్ చేసి అవుట్ అవ్వడం తనకు నచ్చలేదని అన్నారు. గిల్ తండ్రి చేసిన వ్యాఖ్యలను ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించాయి. వీటిని చూసిన సెహ్వాగ్.. తండ్రి మనసు ఇలానే ఉంటుందని కామెంట్ చేశారు. 'భారతదేశ సగటు తండ్రి ఆవేదన ఇలాగే ఉంటుంది. ఎంతైనా ఒక కొడుకుకు తండ్రే కదా.. మీరు అలా ఆలోచించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయినా గిల్ 91 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఆనందం ముందు 100 పరుగులు మిస్ కావడం పెద్ద విషయం కాదు' అంటూ చెప్పుకొచ్చారు వీరూ..! బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మకమైన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మరపురాని విజయం సాధించి సీరీస్ గెల్చుకున్న టీమిండియాపై ట్విట్టర్లో అభినందనల సందేశాలు లక్షల సంఖ్యలో ముంచెత్తాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలుకుని సగటు క్రికెట్ అభిమానుల దాకా భారత్ చారిత్రాత్మక విజయంపట్ల మైమర్చిపోతూ సందేశాలు పంపారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
16 hours ago

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
18 hours ago

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
21 hours ago

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
21 hours ago

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!
05-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
03-03-2021

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021
ఇంకా