newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా

30-09-202030-09-2020 12:45:53 IST
2020-09-30T07:15:53.200Z30-09-2020 2020-09-30T07:15:51.016Z - - 20-10-2020

ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్‌.. భారీ జరిమానా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌లో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), వార్నర్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), విలియమ్సన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లతో 41) రాణించారు. రబాడ, మిశ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్‌ (34), పంత్‌ (28) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

అసలే ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు గట్టి షాక్‌ తగిలింది. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఢిల్లీ జట్టు బౌలింగ్‌ను పూర్తి చేయకపోవడంతో మ్యాచ్‌ రిఫరీ చర్యలు తీసుకున్నారు. స్లో ఓవర్‌ రేట్ కారణంగా.. ఐపీఎల్‌ నిబంధనలు అనుసరించి అతని మ్యాచ్‌ ఫీజులో రూ.12లక్షల కోత విధించారు.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధనల ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తిచేయకపోతే జరిమానా విధిస్తారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ సీజన్‌లో జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైన్‌ విధించిన సంగతి తెలిసిందే.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీసేన దారుణంగా ఓడింది. బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లను వేయకపోవడంతో..కోహ్లీకి రూ.12 లక్షలు ఫైన్ వేశారు. కాగా.. ఒక సీజన్‌లో రెండోసారి అదే తప్పు చేస్తే రూ.24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి చేస్తే రూ.30 లక్షల జరిమానా ఉంటుంది. ఇక నాలుగో సారి ఇదే తప్పు చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఐతే తుది జట్టులో మాత్రం ఉండవచ్చు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle