newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఓ వైపు విజయాలు.. మరో వైపు గాయాలు

15-10-202015-10-2020 15:18:43 IST
Updated On 15-10-2020 15:33:39 ISTUpdated On 15-10-20202020-10-15T09:48:43.803Z15-10-2020 2020-10-15T09:48:19.119Z - 2020-10-15T10:03:39.427Z - 15-10-2020

ఓ వైపు విజయాలు.. మరో వైపు గాయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఢిల్లీ కేపిటల్స్ ఈ సీజన్ లో మంచి ప్రదర్శన కనబరుస్తూ ఉంది. విజయాల మీద విజయాలను సాధిస్తూ పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. కానీ ఆ జట్టును గాయాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికే అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మలు టోర్నమెంట్ నుండి వైదొలగగా.. గాయం కారణంగా పంత్ కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు. ఇక ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 

బుధవారం రాత్రి దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడి.. అర్ధాంతరంగా ఫీల్డ్ నుంచి వెళ్లిపోయాడు. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బంతిని ఆపే ప్రయత్నంలో కిందపడ్డాడు. అతని ఎడమ భుజానికి గాయమైంది. ఫిజియో అయ్యర్ ను అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకుని వెళ్ళిపోయాడు. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రతపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని శిఖర్ ధావన్ మ్యాచ్ అనంతరం చెప్పాడు. 

ఢిల్లీ కేపిటల్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  చెన్నై సూపర్ కింగ్స్‌ తో శనివారం సాయంత్రం ఢిల్లీ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌కు అయ్యర్ దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

బౌలర్లు రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మళ్లీ గెలుపుబాట పట్టింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 13 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. శిఖర్‌ ధవన్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శ్రేయాస్‌ అయ్యర్‌ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) అర్ధ శతకాలతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 1617 స్కోరు చేసింది. జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగి ఆకట్టుకున్నాడు. 

అనంతరం ఛేదనలో రాజస్థాన్‌ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడింది. బెన్‌ స్టోక్స్‌ (35 బంతుల్లో 6 ఫోర్లతో 41), రాబిన్‌ ఊతప్ప (32) రాణించారు. నోకియా (2-33), తుషార్‌ దేశ్‌పాండే (2-37) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నోకియాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle