నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు
27-11-202027-11-2020 15:42:13 IST
Updated On 28-11-2020 12:36:29 ISTUpdated On 28-11-20202020-11-27T10:12:13.765Z27-11-2020 2020-11-27T10:12:08.956Z - 2020-11-28T07:06:29.895Z - 28-11-2020

న్యూజిలాండ్ సిరీస్ కోసం వెళ్లిన పాకిస్థాన్ క్రికెటర్లకు కోవిద్-19 పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలిందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. మొదట నిర్వహించిన టెస్టుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలగా, ఆ తర్వాత మరో నలుగురికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వీరందరినీ క్వారెంటైన్ లో ఉంచారు. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. నవంబర్ 24న పాకిస్థాన్ క్రికెట్ బృందం క్రైస్ట్ చర్చ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా ఏకంగా ఆరు మందికి కరోనా అని తేలింది. ఆటగాళ్లందరూ రూమ్ కే పరిమితం అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. న్యూజిలాండ్ హెల్త్ మినిస్ట్రీ కూడా కఠిన ఆదేశాలను క్రికెట్ బోర్డుకు జారీ చేసింది. వారిలో కొందరు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని, మరోసారి ఇది పునరావృతమైతే పాక్ జట్టును వెనక్కి పంపించేస్తామని న్యూజిలాంట్ క్రికెట్ బోర్టు హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ బోర్డుపై పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మండిపడ్డాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాట్లాడుతున్నది ఒక క్లబ్ స్థాయి జట్టు గురించి కాదని అఖ్తర్ అన్నాడు. పాకిస్థాన్ జాతీయ జట్టు మీ దేశంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మాకు డబ్బపై యావ లేదని... మ్యాచ్ లు ప్రసారం చేసి మీరే డబ్బు సంపాదించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి సమయాల్లో మీ దేశంలో పర్యటించేందుకు తమ జట్టు సిద్ధమైందని అలాంటి జట్టుపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌తో డిసెంబర్10వ తేదీ నుంచి పాకిస్తాన్ సిరీస్ ఆరంభం కానుంది. డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆరంభం కానుండగా, డిసెంబర్ 18వ తేదీన తొలి టీ20 జరుగనుంది. అనంతరం డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకూ రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి
2 hours ago

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా
5 hours ago

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!
9 hours ago

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!
6 hours ago

ఫిట్నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్
27-01-2021

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్
26-01-2021

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్
25-01-2021

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య
25-01-2021

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య
24-01-2021

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్
24-01-2021
ఇంకా