newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

యార్కర్లు చెప్పి మరీ వేశాడు.. రాహుల్ ప్రశంసలు

20-10-202020-10-2020 11:16:30 IST
2020-10-20T05:46:30.745Z20-10-2020 2020-10-20T05:46:27.045Z - - 26-11-2020

యార్కర్లు చెప్పి మరీ వేశాడు.. రాహుల్ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరుస బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించడం ఏ బ్యాట్స్‌మన్ కైనా ఎంత కష్టమో.. ఒక కీలకమైన ఓవర్లో వరుసగా ఆరు బంతులకు ఆరు యార్కర్లు వేస్తానని చెప్పి మరీ వేయడం అద్బుతం, అసాధారణం అంటూ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టు పేసర్ మహమ్మద్ షమీపై ప్రశంసల వర్షం కురిపించాడు. సూపర్ ఓవర్ ఎలా వేయాలనే దానిపై తన బౌలింగ్‌ వ్యూహంపై షమీకి ముందే స్పష్టత ఉన్నట్లు రాహల్ చెప్పాడు.

రెండు సూపర్‌ ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్‌పై పంజాబ్‌ విజయంలో పేసర్‌ మొహమ్మద్‌ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. తొలి సూపర్‌ ఓవర్‌ వేసిన అతను వరుస యార్కర్లతో రోహిత్, డికాక్‌లను ఇబ్బంది పెట్టడంతో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. దాంతో ‘టై’ కావడంతో ఫలితం రెండో సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. తన బౌలింగ్‌ వ్యూహంపై షమీకి ముందే స్పష్టత ఉన్నట్లు కింగ్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వెల్లడించాడు. 

‘సూపర్‌ ఓవర్‌ కోసం సాధారణంగా ఎవరూ సిద్ధంగా ఉండరు. అలాంటి సమయంలో బౌలర్‌ ధైర్యాన్ని, అతని నమ్మకాన్ని మనం నమ్మాలి. తాను ఆరు బంతులు కూడా యార్కర్లుగా వేసేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. అతను చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతనిలాంటి సీనియర్లు మ్యాచ్‌లు గెలిపించడం ఎంతో అవసరం’ అని రాహుల్‌ అన్నాడు. టోర్నీలో సూపర్‌ ఓవర్‌లో ఒకసారి ఓడిన తాము ఈసారి మ్యాచ్‌ గెలవడం సంతోషమే అయినా... ఇది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు అతను వ్యాఖ్యానించాడు.  

తీవ్ర నిరాశలో రోహిత్

మరోవైపు ఈ పరాజయం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను తీవ్రంగా నిరాశపర్చింది. మ్యాచ్‌ తర్వాత ప్రసారకర్తలతో మాట్లాడేందుకు రాని రోహిత్, ఆ తర్వాత మీడియా సమావేశానికి కూడా పొలార్డ్‌ను పంపించాడు. ‘మేం గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయామనే విషయాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇదేమీ జీవితంలో అతి పెద్ద సమస్య కాదు. దీనిని మరచి ముందుకు సాగాలి. పరాజయం తర్వాత రోహిత్‌ బాగా బాధపడుతున్నాడని నాకు తెలిసింది. అయితే అతనో పోరాటయోధుడు అనే విషయం మరచిపోవద్దు’ అని కీరన్‌ పొలార్డ్‌ వెల్లడించాడు.  

గెలవాల్సిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్తే ఎలా.. గేల్ ఆగ్రహ

రెండో సూపర్‌ ఓవర్లో సిక్సర్‌తో చెలరేగి గెలిపించిన క్రిస్‌ గేల్‌ మాట్లాడుతూ...అసలు మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లడమే తనకు నచ్చలేదని అన్నాడు. పంజాబ్‌ రెగ్యులర్‌ టైమ్‌లోనే మ్యాచ్‌ను గెలవాల్సిందని అభిప్రాయపడిన అతను, తాను ఒత్తిడికి లోను కాలేదని స్పష్టం చేశాడు. ‘సూపర్‌ ఓవర్లో ఆడే సమయంలో నేనేమీ ఒత్తిడికి లోను కాలేదు. అయితే అలాంటి స్థితికి మ్యాచ్‌ రావడమే నాకు ఆగ్రహం కలిగించింది. నిజానికి సూపర్‌ ఓవర్‌లో మొదటి బాల్‌ ఎవరు ఆడాలని మయాంక్‌ అడిగితే ఆశ్చర్యపోయా. ఎప్పుడైనా ‘బాస్‌’ ఆడాల్సిందేనని, తొలి బంతిని సిక్స్‌ కొడతాను చూడని కూడా అతనితో చెప్పా’ అని గేల్‌ వెల్లడించాడు. 

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

   6 hours ago


ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

   7 hours ago


బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

   24-11-2020


కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

   24-11-2020


టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..?  అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..? అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

   24-11-2020


ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

   24-11-2020


ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

   23-11-2020


మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

   23-11-2020


నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

   23-11-2020


ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

   21-11-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle