newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

24-11-202024-11-2020 09:13:30 IST
Updated On 24-11-2020 10:20:52 ISTUpdated On 24-11-20202020-11-24T03:43:30.482Z24-11-2020 2020-11-24T03:43:26.606Z - 2020-11-24T04:50:52.145Z - 24-11-2020

ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

షాహిద్ అఫ్రీది.. ఒకప్పుడు అతడి ఆటలో మెరుపులు ఉండేవి. దిగితే సిక్సర్లతో విరుచుకుపడడం లేదంటే అవుట్ అయ్యి పెవిలియన్ చేరడం.. ఇదే ఈ పాక్ ఆల్ రౌండర్ కు తెలిసిన ఆట..! ఇక టీ20ల్లో కూడా ఇదే తరహాలో ఆడేవాడు. ఆల్ రౌండర్ గా అతడి సేవలను పలు జట్లు ఉపయోగించుకున్నాయి. రెండు-మూడు సార్లు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడనుకోండి అది వేరే విషయం. ఇక ప్రస్తుతానికి కొన్ని టీ20 లీగుల్లో ఆడుతూ వస్తున్నాడు అఫ్రీది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పేలవ ప్రదర్శన కనబర్చిన అఫ్రీది.. లంక ప్రీమియర్ లీగ్ లో ఏకంగా కెప్టెన్ గా అవతారం ఎత్తాడు. అఫ్రీది ఆట తీరే అంతమాత్రంగా ఉంది.. ఇలాంటి తరుణంలో అతడిని కెప్టెన్ చేయడం అంటే అది ఊహించని పరిణామం. 

ఎల్‌పీఎల్‌ లో ‘గాలె గ్లాడియేటర్స్‌’ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా‌ షాహిద్‌ అఫ్రీదిని ఎంపిక చేశారు. సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్థానాన్ని అఫ్రిది భర్తీ చేయనున్నాడు. తొలుత గాలె గ్లాడియేటర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నియమితుడయ్యాడు. అయితే న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపిక చేసిన పాకిస్తాన్‌ జాతీయ జట్టులోకి సర్ఫరాజ్‌కు పిలుపు రావడంతో అతని స్థానంలో అఫ్రీది కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యజమాని, పాకిస్తాన్‌ పారిశ్రామికవేత్త నదీమ్‌ ఒమర్‌ స్పష్టం చేశారు.  ఈ టోర్నీలో జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్, గాలె గ్లాడియేటర్స్, కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్‌ జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 16 వరకు ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ టోర్నమెంట్ క్రికెట్ అభిమానులకు మాంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తే చాలు..! 

ఇది చదవండి: షోయబ్ మాలిక్ ఇక గుడ్ బై చెప్పేసినట్లేనా...

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

   44 minutes ago


పాండ్యా సోదరులకు పితృ వియోగం

పాండ్యా సోదరులకు పితృ వియోగం

   8 hours ago


భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

   15-01-2021


బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

   15-01-2021


భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

   15-01-2021


ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

   14-01-2021


క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

   14-01-2021


మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

   13-01-2021


అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

   13-01-2021


ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle