newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

13-04-202113-04-2021 10:52:09 IST
2021-04-13T05:22:09.553Z13-04-2021 2021-04-13T05:02:56.923Z - - 15-05-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనీష్ పాండే వంటి సిక్సర్ల వీరుడు చివరి మూడు ఓవర్లలో చివరి బంతి తప్ప ఒక్క బౌండరీని కూడా బాదలేకపోవడం వల్లే సన్ రైజర్స్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే చివరి వరకు క్రీజులో ఉన్నా మ్యాచ్ గెలిపించలేకపోవడానికి అతడి దురదృష్టమే కారణమని సెహ్వాగ్ చెప్పాడు.

నిజానికి ఆదివారం కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌‌లో సన్ రైజర్స్ జట్టు చివరి మూడు ఓవర్లలోనే గెలుపు చాన్స్ పోగొట్టుకుందని సెహ్వాగ్ చెప్పాడు. నిలబడితే చాలు సిక్సర్లు దండుకునే మనీష్ పాండేకి చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా బాదలేకపోవడం చాలా అరుదైన విషయమని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు మనీష్‌ పాండే కడవరకూ క్రీజ్‌లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోవడానికి కారణం బంతులు అతని రాడార్‌లో పడకపోవడమే. అసలు చివరి మూడు ఓవర్లలో మనీష్‌ ఒక్క బౌండరీ కూడా సాధించకపోవడానికి బంతులు అతని అంచనాకు అందకపోవడమేనని సెహ్వగ్ వివరించాడు.

క్రికెట్ ఆట తీరే ఇంత.. కొన్ని సార్లు ఆలాగే జరుగుతుంది. ఎంతో ఒత్తిడి భరిస్తూ కూడా క్రీజులో నిలిచిన బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను గెలిపించడానికి విశ్వప్రయత్నం చేసినా మనీష్ పాండేకి అది సాధ్యపడలేదు. కారణం ఏంటి? చివరి మూడు ఓవర్లు క్రీజులో నిలిచిన మనీష్ పాండే ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా చేయలేకపోయాడు. ఎట్టకేలకు చివరి బంతికి సిక్సు బాదినా అప్పటికే మ్యాచ్ అయిపోయందని సెహ్వాగ్ చెప్పాడు.

ఆదివారం జరిగిన ఆ మ్యాచ్‌లో మనీష్‌ పాండే నిజంగానే కీలక పాత్ర పోషించాడని, ముఖ్యమైన వికెట్లు పడిపోయినప్పుడు క్రీజ్‌లో నిలదొక్కుకుని మరీ మ్యాచ్‌ను గెలిపించే దిశగా ప్రయత్నం చేశాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. పాండే చాలా ఒత్తిడిలో  క్రీజ్‌లో సెట్‌ అయ్యాడు. అతడు ఇంకొన్ని బౌండరీలు కొట్టుంటే ఆ మ్యాచ్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయేది కాదన్నాడు. 

మనీష్‌ అనుకున్న చోట బంతులు పడలేదు.  అందుకే విఫలమయ్యాడు.  కొన్ని సార్లు అలానే జరుగుతుంది. మనీష్‌ క్రీజులో కుదురుకున్నాడు, కానీ బంతులు హిట్‌ చేసేందుకు ఏమాత్రం వీలుకాలేదు. లేకపోతే సన్‌రైజర్స్‌ ఆ మ్యాచ్‌ ఓడిపోయేది కాదు అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మనీష్‌ పాండే క్రీజ్‌లో ఉండటంతో సన్ రైజర్స్ జట్టు గెలుస్తుందని ఆ ఫ్రాంచైజీ అభిమానులు భావించినా కలకత్తా నైట్ రైడర్స్ జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి విజయాన్ని అందుకుంది. మనీష్‌ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ మ్యాచ్ గెలిపించలేకపోయాడు.

అందుకే ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టావ్‌.. కానీ అప్పటికే మ్యాచ్‌ పోయింది అని సెహ్వాగ్ కాస్త సానుభూతి చూపాడు.

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle