newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

28-02-202128-02-2021 16:59:27 IST
2021-02-28T11:29:27.716Z28-02-2021 2021-02-28T07:31:55.308Z - - 11-04-2021

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపుపొందిన అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో స్పిన్ బౌలింగ్ ధాటికి తట్టుకోలేక భారత్, ఇంగ్లండ్ జట్లలోని ఘనాపాఠీలు వికెట్లు పారవేసుకున్న వైనంపై, మొతేరా స్టేడియం పిచ్‌పై వస్తున్న విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఆ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఔటైన తీరు ప‌ట్ల టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. పిచ్‌పై నింద వేయ‌డం క‌న్నా.. షాట్ సెల‌క్ష‌న్‌, ఫుట్‌వ‌ర్క్‌పై దృష్టి పెట్టాల‌ని సూచించాడు. పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా విజయం అనంతరం అజారుద్దీన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

అహ్మ‌దాబాద్ టెస్టులో స్పిన్నర్ల దాటికి బ్యాట్స్‌మెన్ కుప్ప‌కూల‌డం నిరుత్సాహప‌రిచింది. అలాంటి డ్రై ట్రాక్‌ల‌పై బ్యాటింగ్ చేయాలంటే.. షాట్ల ఎంపికతో పాటు ఫుట్‌వ‌ర్క్ కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాటింగ్ స‌మ‌యంలో స్పైక్ షూ ధ‌రించ‌డం వ‌ల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇలాంటి పిచ్‌ల‌పై ర‌బ్బ‌ర్ సోల్ ఉన్న షూల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల బ్యాట్స్‌మెన్ సామ‌ర్థ్యం త‌గ్గదు అని అజారుద్దీన్ పేర్కొన్నారు.

బ్యాటింగ్‌కు అనుకూలించని ఇలాంటి నిర్జీవ‌మైన మైదానాల్లో ఉత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌ల‌ను ఎన్నో చూశాను. గతంలో ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ కేవ‌లం ర‌బ్బ‌ర్ సోల్స్ ధ‌రించి రాణించారు. ర‌బ్బ‌ర్ షూ ధ‌రించిన ఆట‌గాళ్లు పిచ్‌పై జారిప‌డుతార‌న్న వాద‌న‌ తప్పు. వింబుల్డ‌న్ లాంటి టెన్నిస్ టోర్నీల్లో ప్లేయ‌ర్లు ర‌బ్బ‌ర్ షూల‌తోనూ ఆడుతున్నారు. 

గ‌తంలో టీమిండియా దిగ్గజాలు సునీల్ గ‌వాస్క‌ర్‌, మోహింద‌ర్ అమ‌ర్‌నాథ్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌తో పాటు విండీస్ దిగ్గ‌జం వివియ‌న్ రిచ‌ర్డ్స్‌, మైక్ గ్యాటింగ్‌, అలెన్ బోర్డ‌ర్‌ లాంటి వాళ్లు ర‌బ్బ‌ర్ సోల్ ఉన్న షూతోనే ఆడేవారు. డ్రై పిచ్‌ల‌పై ర‌బ్బ‌ర్ సోల్ ఉన్న షూస్‌ను ప్రిఫర్‌ చేయ‌డం మంచిదని నా అభిప్రాయం అని అజారుద్దీన్  చెప్పుకొచ్చాడు. 

రెండు ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ జట్టులో కుప్పగూలిన 20 వికెట్లలో 19 వికెట్లను రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఫేస్ బౌలింగ్‌ను పస లేకుండా చేసిన ఈ మైదానంలో రెండు జట్ల స్పిన్నర్లు విజృంభించి రెండురోజుల్లోనే టెస్టు మ్యాచ్‌ని ముగించడం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది.

దీంతో రోజుల తరబడి మొతేరా పిచ్ పై విమర్శలు, వ్యాఖ్యలు చెలరేగుతున్నాయి. ఈ తరుణంలో భారత క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్ ఆడ లేక పిచ్ బాగా లేదనం ఏంటి అంటూ వ్యాఖ్యానించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle