newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!

29-09-202029-09-2020 14:01:11 IST
2020-09-29T08:31:11.445Z29-09-2020 2020-09-29T08:30:55.763Z - - 25-10-2020

రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ ల లోనూ అదే పొరపాటు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ఏడాది ఐపీఎల్ లో కొన్ని అద్భుతమైన మ్యాచ్ లను చూసారు అభిమానులు. టోర్నీ ఇంకా పాతిక శాతం కూడా పూర్తీ కాలేదు.. అప్పుడే రెండు సూపర్ ఓవర్లను అభిమానులు చూసేశారు. ఈ రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్ లలో కెప్టెన్లు ఒకటే తరహా తప్పులు చేయడం విశేషం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య సూపర్‌ ఓవర్ జరగ్గా.. ఢిల్లీ విజయం సాధించింది. ముంబై మీద బెంగళూరు గెలుపొందింది. కింగ్స్ లెవెన్ పంజాబ్ చేసిన పొరపాటునే ముంబై కూడా చేసింది. ఈ విషయం నిజంగా అందరినీ ఆశ్చర్య పరిచింది. 

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ ను ఆరోజు సూపర్ ఓవర్ లో ఆడించలేదు పంజాబ్ జట్టు. ముంబైకి దాదాపు విజయం దూరమైన దశలో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి ఇషాన్ కిషన్ ను ముంబై సూపర్ ఓవర్ లో పంపలేదు. ఇషాన్ కిషన్ అద్భుతంగా బంతిని మిడిల్ చేశాడు.. కానీ అప్పటికే అలసి పోయినట్లు కనిపించడంతో బిగ్ హిట్టర్లు అయిన పొలార్డ్, హార్దిక్ లను ముంబై సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు పంపింది. ఇషాన్ కిషన్ అలసిపోయి ఉండటంతో.. అతడి బదులు హార్దిక్ పాండ్యాను బరిలో దింపారు. కానీ ఇదే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది.  ఫామ్‌లో ఉన్న కిషన్‌ లెఫ్ట్ హ్యాండర్ అవ్వడంతో బంతిని బౌండరీకి తరలించే వాడు. కానీ హార్దిక్ పాండ్యా సూపర్ ఓవర్ లో సరైన ఆట తీరు చూపించలేదు. ఇక రెండు బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. రెండు పరుగులు మాత్రమే చేశాడు.

సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా, రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల టార్గెట్  ఇచ్చింది. 

ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. మొదటి రెండు బంతులు.. ఒక్కో పరుగు తీయగా.. మూడో బంతి డాట్ బాల్ అయింది. బుమ్రా మ్యాజిక్ చూడొచ్చని భావించగా.. నాలుగో బంతిని ఫోర్ కొట్టాడు ఏబీడీ.. ఐదో బంతి కాస్తా సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle