newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఒత్తిడికి చిత్తయిన రాయల్స్.. టాప్ గేర్‌లో ఢిల్లీ

15-10-202015-10-2020 09:01:06 IST
2020-10-15T03:31:06.153Z15-10-2020 2020-10-15T03:31:02.816Z - - 21-10-2020

ఒత్తిడికి చిత్తయిన రాయల్స్.. టాప్ గేర్‌లో ఢిల్లీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ సైతం విజయంపై ఆశలు వదిలేసుకునేంత ధీటుగా ఛేదనలో విరగదీసిన రాజస్తాన్ రాయల్స్ ఒత్తిడికి గురై చివరి 5 ఓవర్లలో పరాజయం పాలైంది. ఒక దశలో సులువుగా గెలుస్తుందనుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. చివర్లో తడబడి మ్యాచ్‌ను చేజార్చుకుంది. 5 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో.. ఒత్తిడికి చిత్తయింది. ఓ మాదిరి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా.. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌నకు చేరుకుంది. 

బౌలర్లు రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మళ్లీ గెలుపుబాట పట్టింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 13 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. శిఖర్‌ ధవన్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శ్రేయాస్‌ అయ్యర్‌ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) అర్ధ శతకాలతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 1617 స్కోరు చేసింది. జోఫ్రా ఆర్చర్‌ (319) మూడు వికెట్లు పడగొట్టగా.. యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగి (130) ఆకట్టుకున్నాడు. 

అనంతరం ఛేదనలో రాజస్థాన్‌ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడింది. బెన్‌ స్టోక్స్‌ (35 బంతుల్లో 6 ఫోర్లతో 41), రాబిన్‌ ఊతప్ప (32) రాణించారు. నోకియా (233), తుషార్‌ దేశ్‌పాండే (237) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నోకియాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఛేదనలో రాజస్థాన్‌కు ఓపెనర్లు స్టోక్స్‌, బట్లర్‌ (22) ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. రబాడ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతినే స్టోక్స్‌ బౌండ్రీకి తరలించగా.. బట్లర్‌ కూడా ఫోర్‌ బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో స్టోక్స్‌ రెండు ఫోర్లతో చెలరేగాడు. తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించి జోరుమీదున్న వీరి భాగస్వామ్యాన్ని నోకియా విడదీశాడు. 

మూడో ఓవర్‌లో 6,4,4తో విరుచుకుపడ్డ బట్లర్‌ను.. బౌల్డ్‌ చేశాడు. స్మిత్‌ (1)ను అశ్విన్‌ రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌ (25).. స్టోక్స్‌తో కలసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 852తో నిలిచింది. అయితే, అరంగేట్ర మ్యాచ్‌ ఆడుతున్న పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే.. స్టోక్స్‌ను అవుట్‌ చేసి ఢిల్లీకి బ్రేక్‌ ఇచ్చాడు. స్టోక్స్‌-శాంసన్‌ రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అక్షర్‌ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకున్న శాంసన్‌ పెవిలియన్‌ చేరాడు. అయితే, రాబిన్‌ ఊతప్ప ధాటిగా ఆడుతూ రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు. కానీ, 13వ ఓవర్‌లో ఊతప్పతో సమన్వయ లోపం కారణంగా రియాన్‌ పరాగ్‌ (1) రనౌటయ్యాడు. 

ఆఖర్లో తడబాటు విజయానికి 30 బంతుల్లో 39 పరుగులు కావాల్సి ఉండగా.. రాహుల్‌ తెవాటియా (14 నాటౌట్‌) క్రీజులో ఉండడంతో రాయల్స్‌ గెలుపు లాంఛనమే అనుకున్నారు. కానీ, చివరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. 16వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన అశ్విన్‌ 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఒత్తిడి పెంచాడు. 18వ ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌కు దిగిన నోకియా.. ఊతప్పను బౌల్డ్‌ చేసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు. 

చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు చేయాల్సి రావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఆర్చర్‌ (1)ను రబాడ అవుట్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతిని తుషార్‌ వైడ్‌ వేయగా.. తర్వాతి బంతికి తెవాటియా భారీ షాట్‌ ఆడాడు. కానీ, రహానె అద్భుత ఫీల్డింగ్‌తో ఒక్క పరుగే లభించింది. దీంతో మ్యాచ్‌ ఢిల్లీవైపు మొగ్గింది. శ్రేయాస్‌ గోపాల్‌ (6) ఆఖరి బంతికి అవుటయ్యాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని శిఖర్‌ ధవన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ అర్ధ శతకాలతో నిలబెట్టారు. అయితే, ఆఖర్లో బ్యాట్స్‌మెన్‌ మెరుపులు లేకపోవడంతో ఆ జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. తొలి బంతికే ఓపెనర్‌ పృథ్వీ షా(0)ను డకౌట్‌ చేసిన ఆర్చర్‌.. రహానె (2)ను కూడా అవుట్‌ చేశాడు. మరో ఓపెనర్‌ ధవన్‌, కెప్టెన్‌ అయ్యర్‌తో కలిసి జట్టును ఆదుకొన్నాడు. త్యాగి వేసిన నాలుగో ఓవర్‌ మూడో బంతిని సిక్స్‌గా మలచిన ధవన్‌.. ఒక్కసారిగా గేర్‌ మార్చాడు. స్టోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. వీలుచిక్కినప్పుడల్లా గబ్బర్‌ బౌండ్రీలు బాదడంతో.. 7వ ఓవర్‌లో ఢిల్లీ స్కోరు 50 పరుగులు దాటింది. అయితే, అర్ధ శతకంతో జోరు మీదున్న ధవన్‌ను శ్రేయాస్‌ గోపాల్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. 

దీంతో మూడో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయ్యర్‌కు స్టొయినిస్‌ (18) జత కలవడంతో పరుగులు జోరందుకున్నాయి. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన శ్రేయాస్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పాడు. ఉనాద్కట్‌ వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన అయ్యర్‌.. హాఫ్‌ సెంచరీ చేరుకున్నాడు. అయితే, మరోసారి బౌలింగ్‌కు దిగిన త్యాగి.. కీలక సమయంలో శ్రేయా్‌సను అవుట్‌ చేసి రాజస్థాన్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. స్టొయిని్‌సతో కలసి నాలుగో వికెట్‌కు అయ్యర్‌ 37 పరుగులు జోడించాడు. ఈ దశలో రాజస్థాన్‌ బౌలర్లు పట్టు బిగించడంతో.. ఢిల్లీ చివరి 5 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. ఆర్చర్‌ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడే క్రమంలో స్టొయినిస్‌ పెవిలియన్‌ చేరగా.. ఆఖరి ఓవర్‌లో అలెక్స్‌ క్యారీ (14), అక్షర్‌ పటేల్‌ (7)ను ఉనాద్కట్‌ అవుట్‌ చేశాడు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle