బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-202115-01-2021 14:24:03 IST
2021-01-15T08:54:03.128Z15-01-2021 2021-01-15T06:18:02.319Z - - 07-03-2021

అభిజిత్ ఎవరు. ఓ సాదా సీదా హీరో. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్. అంతే కదా. రోహిత్ శర్మ ఎవరు. ఫేమస్ క్రికెటర్. మరి అభిజిత్ కి రోహిత్ శర్మ నుంచి గిఫ్ట్ వచ్చిందంటే మామూలు మాటలా చెప్పండి. ఈ ఇద్దరికీ లింక్ ఎలా కుదిరింది. ఏ పార్టీలో కలిశారు. ఏ సినిమా ఫంక్షన్ లో కలిశారు. ఏ స్టేడియంలో కలిశారు అనే డౌట్ మామూలే.
ఏదెలా ఉన్నా.. అభిజిత్ కి అయితే.. గిఫ్ట్ వచ్చింది. ఉత్తి గిఫ్టే పోస్ట్ లో వచ్చింది అనుకునేరు. నేరుగా రోహిత్ శర్మ నుంచి ఫోన్ కూడా వచ్చిందంట. ఫోన్ చేసిన రోహిత్ శర్మ.. కంగ్రాట్స్ మిస్టర్ కూల్. నువ్వే బిగ్ బాస్ ఫోర్ విన్నర్ అట కదా. నాకు చాలా హ్యాప్పీగా ఉంది మ్యాన్. నువ్వు మిస్టర్ కూల్ అని విన్నాను. నీ కెరీర్ సూపర్ గా ఉండాలి. మంచి పెద్ద హీరోవి కావాలి. ఇప్పుడొచ్చిన క్రేజ్ వంద రెట్లు ఎక్కువ కావాలి అని ఫోన్ లో విషెస్ చెప్పాడట రోహిత్ శర్మ. అంతేనా. తన జెర్సీని కూడా పంపించాడట. జెర్సీపై తన సైన్ చేసి మరీ పంపడంతో.. అభిజిత్ ఇప్పుడు ఫుల్లు హ్యాప్పీ.
ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్ శర్మ.. హనుమ విహారీకి మంచి డిస్కషన్ నడిచిందంట. ఆ టైంలో.. తెలుగు బిగ్ బాస్ గురించి టాక్ వచ్చిందంట. ఆ టైంలో.. అభిజిత్ గురించి రోహిత్ శర్మకి చెప్పిన హనుమ విహారీ.. అభిజిత్ నీకు పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పాడట. అంతే ఇక. నా ఫ్యాన్ బిగ్ బాస్ విన్నర్ అయినప్పుడు నేను ఫోన్ చేయకపోతే ఎలా అని.. వెంటనే నెంబర్ తీసుకుని ఫోన్ కొట్టి విషెస్ చెప్పి.. జెర్సీ కూడా పంపాడట. అద్దీ మ్యాటర్.
ఇక అభిజిత్ ఆగుతాడా చెప్పండి. ఆగమేఘాల మీద సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి.. ఆ విషయాన్ని తన అభిమానులతో ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ నుంచి.. తనకి ఫోన్ కాల్ రావడం.. గిఫ్ట్ కూడా రావడంతో ఫుల్ ఖుషీ అయ్యి.. అదే విషయాన్ని అందరికీ చెప్పుకుంటున్నాడు. తన గురించి రోహిత్ శర్మకి చెప్పిన హనుమ విహారీకి కూడా థ్యాంక్స్ చెప్పాడు అభిజిత్. అదీ కత.

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
16 hours ago

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
17 hours ago

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
21 hours ago

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
21 hours ago

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!
05-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
03-03-2021

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021
ఇంకా