టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..? అయ్యర్‌కు ఛాన్స్..!
24-11-202024-11-2020 11:32:11 IST
Updated On 24-11-2020 11:44:07 ISTUpdated On 24-11-20202020-11-24T06:02:11.198Z24-11-2020 2020-11-24T06:02:06.148Z - 2020-11-24T06:14:07.851Z - 24-11-2020

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కానున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. హిట్‌మ్యాన్‌తో పాటు సినీయర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా టెస్టు సిరీస్‌లో ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. గాయాలతో సతమతమవుతున్న వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు వారి ఫిట్నెస్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరూ టెస్టు సిరీస్‌కు దూరం అయితే.. టీమ్ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీలతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. స్వదేశంలో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్ విదేశాల్లో టెస్టు ఓపెనర్‌గా సత్తాచాటాలని బావిస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం తొడ కండరాల గాయంతో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. మొదటి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇండియాకు తిరిగి రానున్నాడు. ఇప్పుడు హిట్‌మ్యాన్ కూడా అందుబాటులో లేకుంటే.. బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్ర ప్రభావం పడనుంది. టెస్టు సిరీస్‌లో పాల్గొనాలంటే రోహిత్ శర్మ, ఇషాంత్ మరో నాలుగైదు రోజుల్లోనే ఆస్ట్రేలియా చేరుకోవాలని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితులు మారిపోతాయని, క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో వీలైనంత త్వరగా వారిద్దరు భారత్ నుంచి బయల్దేరాలని అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో ఆడాలంటే కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లోనైనా ఆడాల్సి ఉంటుందని రవిశాస్త్రి చెప్పాడు. ఒకవేళ రోహిత్ ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుంటే.. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ బావిస్తోంది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో నెంబర్ 4 స్థానంలో సత్తా చాటిన అయ్యర్.. టెస్టులో కూడా అరగ్రేటం చేయనున్నాడు. ప్రస్తుతం అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక రోహిత్, ఇషాంత్ పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్‌కు వెళ్తారా లేదా అన్న అంశంపై సందిగ్దత నెలకొంది.

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
an hour ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
8 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!
13-01-2021
ఇంకా