రోహిత్ శర్మ తండ్రికి కరోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్లని హిట్‌మ్యాన్..!
25-11-202025-11-2020 19:41:56 IST
Updated On 26-11-2020 08:13:04 ISTUpdated On 26-11-20202020-11-25T14:11:56.917Z25-11-2020 2020-11-25T14:10:05.358Z - 2020-11-26T02:43:04.901Z - 26-11-2020

కరోనా మహమ్మారి తరువాత టీమ్ఇండియా తొలిసారి ఓ సిరీస్ ఆడబోతుంది. అది కూడా ఆస్ట్రేలియాపై. ఇద్దరు సమఉజ్జీల మధ్య సమరం అంటే.. క్రికెట్ అభిమానులకు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. మరో రెండు రోజుల్లో సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. ఈ సిరీస్ గురించిన చర్చ కంటే.. ఎక్కువగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లకపోవడంపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లీగ్ స్టేజ్‌లో రోహిత్‌శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఆడిన తరువాతి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ లోపు ఆసీస్ వెళ్లే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అందులో రోహిత్‌కు చోటివ్వలేదు. గాయం కారణంగానే రోహిత్‌ను పక్కన బెట్టారని అంతా బావించారు. అయితే.. అనూహ్యంగా జట్టును ప్రకటించిన రోజే.. రోహిత్ తన ప్రాక్టీస్ మొదలెట్టాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆసీస్ పర్యటనకు హిట్‌మ్యాన్ ఎంపిక చేయనందుకు ఇటు మాజీలు, అటు అభిమానులు పెద్ద ఎత్తున సెలక్టర్లపై విమర్శలు గుప్పించారు. దీంతో వెంటనే రివైజ్డ్ టీమ్ ప్రకటించిన సెలెక్టర్లు.. టెస్ట్ సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టులకు రోహిత్ దూరం.. ఐపీఎల్ ముగియగానే ఆసీస్ టూర్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లంతా దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లగా.. రోహిత్ మాత్రం భారత్‌కు వచ్చాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో సహచర పేసర్ ఇషాంత్ శర్మతో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. హిట్‌మ్యాన్ ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో.. ఆస్ట్రేలియా వెళ్లడం అనుమానంగానే మారింది. డిసెంబర్ 11 మరోసారి రోహిత్ ఫిట్నెస్ను సమీక్షించనున్నారు. దీంతో తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నాడని కూడా బీసీసీఐ ప్రకటించింది. అసలు రోహిత్‌ను భారత్‌కు ఎవరు పంపించారనే చర్చ ఊపందుకుంది. అంతర్జాతీయ సిరీస్‌ల కన్నా బీసీసీఐకి ఐపీఎల్ ఎక్కువైందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. దాంతో రోహిత్‌ను తాము ఎన్సీఏకు వెళ్లమని చెప్పలేదని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. ఈ వరుస పరిణామాలతో అసలేం జరుగుతుందో అభిమానులకు అర్థం కావడంలేదు. దీన్ని బట్టి హిట్ మ్యానే ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్ వచ్చాడని అర్థం అవుతోంది. హిట్‌మ్యాన్ ఇలా చేయడానికి కారణం ఉందని తెలుస్తోంది. రోహిత్ స్వదేశానికి తిరిగి రావడానికి గాయం లేదా మరో కమిట్మెంట్ ఏదీ కారణం కాదు. రోహిత్ తండ్రికి కరోనా సోకిందని.. అందుకే అతడు భారత్ తిరిగొచ్చాడని క్రికెట్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వైస్‌కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు.. రెడ్ బాల్ సిరీస్ ఆడాలనే ఉద్దేశం లేదనే వాదనలో వాస్తవం లేదని కూడా మజుందార్ స్పష్టం చేశాడు. హిట్ మ్యాన్ అలా భావిస్తే అసలు ఎన్సీఏకే వెళ్లేవాడు కాదని, హాయిగా ఇంట్లో సతీమణి రితికాతో గడిపేవాడని పేర్కొన్నాడు. ఒకవేళ టీమ్ సభ్యులతో కలిసి రోహిత్ నేరుగా ఆసీస్ వెళ్లి ఉంటే.. టీమ్ ఫిజియో సమక్షంలో ట్రైనింగ్ తీసుకొని ఉండుంటే.. టెస్టు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండేవాడు. కానీ అతడు భారత్ తిరిగొచ్చేయడంతో టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్, ఇషాంత్ శర్మ కోసం క్వారంటైన్ నిబంధనలను సడలించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను బీసీసీఐ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్
31 minutes ago

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
2 hours ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
9 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021
ఇంకా