విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్
16-01-202116-01-2021 20:03:08 IST
Updated On 17-01-2021 16:04:58 ISTUpdated On 17-01-20212021-01-16T14:33:08.692Z16-01-2021 2021-01-16T14:33:05.237Z - 2021-01-17T10:34:58.874Z - 17-01-2021

రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ లో అవుట్ అవుతున్న తీరు అభిమానులను కలవరపెడుతూ ఉంది. రోహిత్ శర్మ అవుట్ అవ్వడాన్ని చాలా మంది విశ్లేషకులు తప్పుబడుతూ ఉండగా.. రోహిత్ శర్మ ఈ విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఆ షాట్ ఆడినందుకు తాను బాధ పడటం లేదని అన్నాడు. ఇదే టెక్నిక్ తో గతంలో తాను ఎన్నో బౌండరీలను సాధించానని చెప్పాడు. బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలాంటి షాట్లను ఆడుతుంటానని తన షాట్ సెలెక్షన్ ను సమర్థించుకున్నాడు. ఇకపై కూడా తాను ఇలానే ఆడుతుంటానని.. ఈ షాట్ ఆడినప్పుడు కొన్ని సార్లు బంతి బౌండరీకి అవతల పడొచ్చని... కొన్నిసార్లు క్యాచ్ ఔట్ కావచ్చని చెప్పాడు. జట్టు తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచిందని అన్నాడు. దానికి తగ్గట్టుగా ఆడటం తన బాధ్యత అని.. విమర్శల గురించి తాను అసలు పట్టించుకోనని తన దృష్టి మొత్తం ఆటపైనే ఉంటుందని చెప్పాడు. మంచి దూకుడు మీద ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ చాలా సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ ఔట్ అయిన తీరుపై విమర్శలు గుప్పించారు. రోహిత్ షాట్ సెలెక్షన్ అసలు బాగోలేదని.. టెస్ట్ మ్యాచ్ లో కూడా వికెట్లను ఇంత సులువుగా ఇచ్చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని గవాస్కర్ వ్యక్తం చేశారు. లాంగాన్ లో, స్వేర్ లెగ్ లో ఫీల్డర్లు ఉన్నప్పుడు ఆ షాట్ ఆడాలని ఎలా అనుకున్నావని రోహిత్ ను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. లయన్ బౌలింగ్ లో కాన్ఫిడెంట్ గా బౌండరీలు కొట్టిన రోహిత్ రాంగ్ షాట్ ఎలా ఆడాడో అర్థం కావడం లేదని అన్నారు. సీనియర్ ఆటగాడు అయ్యుండి అనవసరంగా వికెట్ ను సమర్పించుకున్నాడని అభిప్రాయాన్ని వెల్లడించారు గవాస్కర్. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ సందర్భంగా ప్రారంభమైన వర్షం జోరుగా కురిసింది. దీంతో మైదానం చిత్తడిగా మారింది. అప్పటికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 2 వికెట్లకు 62 పరుగులు. మైదానాన్ని ఆటకు సిద్ధం చేసేందుకు గబ్బా స్టేడియం సిబ్బంది ఎంతగా శ్రమించినా ఫలితం లేకపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి రెండో రోజు ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఓవర్ నైట్ స్కోరు 274/5తో రెండో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 369 పరుగులకు ఆలౌటైంది.

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
5 hours ago

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
11 hours ago

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
a day ago

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ
01-03-2021

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్
28-02-2021

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!
28-02-2021

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య
28-02-2021

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం
27-02-2021
ఇంకా