newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

పిచ్ ల గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించిన రోహిత్

22-02-202122-02-2021 18:09:00 IST
Updated On 22-02-2021 18:16:28 ISTUpdated On 22-02-20212021-02-22T12:39:00.752Z22-02-2021 2021-02-22T12:37:42.102Z - 2021-02-22T12:46:28.563Z - 22-02-2021

పిచ్ ల గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించిన రోహిత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చెన్నై రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఉపయోగించిన స్పిన్ పిచ్ పై ఇంగ్లాండ్ కు చెందిన మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. భారత జట్టు గెలవడం కోసం కావాలనే స్పిన్ పిచ్ ను తయారు చేశారని.. మూడు రోజుల్లోనే ముగిసేలా పిచ్ ను తయారు చేశారని విమర్శించారు.  విమర్శలు చేస్తూ వస్తున్నారు. రెండో టెస్టు తరువాత మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, మార్క్ వా తదితరులు చెపాక్ పిచ్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల ఆట ఆడేందుకు ఈ పిచ్ పనికిరాదని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు.

గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ కొనసాగింది. ఈ విమర్శలపై  ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు. పిచ్‌ల గురించి అనవసరంగా రచ్చ చేస్తున్నారని.. దీనికి బదులు ఆటగాళ్లు, వారి ప్రదర్శనలపై చర్చించాలని విశ్లేషకులు, అభిమానులకు ఈ టీమిండియా ఓపెనర్‌ సూచించాడు. రెండు జట్లకు పిచ్‌ సమానమేనని.. మెరుగ్గా ఆడినవాళ్లే గెలుస్తారని తెలిపాడు.  

క్రికెట్ మ్యాచ్ లలో హోమ్ అడ్వాంటేజ్ అన్నది ఉంటుందని.. ప్రతి దేశం కూడా ఇలాగే పిచ్ లను తయారు చేస్తూ ఉంటాయని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడే ప్రతి దేశంలోనూ జరిగేదే భారత్ లోనూ జరుగుతుందని తెలిపాడు. ఇరు జట్లకూ పిచ్ ఒకటే. అసలీ చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.. ఎన్నో ఏళ్లుగా ఉపఖండంలోని పిచ్ లను ఇలానే తయారు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేస్తున్నదేమీ లేదని రోహిత్ శర్మ అన్నాడు. స్థానిక పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి జట్టు కోరుకుంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మా గురించి ఎవరూ ఆలోచించరు. అలాంటప్పుడు ఇతర జట్ల గురించి మేమెందుకు ఆలోచించాలి? జట్టు ప్రాధాన్యత ప్రకారం నడుచుకోవాలి.

సొంతగడ్డపై సానుకూలత అంటే అదే. లేదంటే పూర్తిగా మార్చేయండి. ఎక్కడైనా పిచ్‌లన్నీ ఒకేలా ఉండేలా ఐసీసీ నిబంధనలు రూపొందించాలి అని కాస్త కటువుగా చెప్పుకొచ్చాడు రోహిత్. ఏ దేశమైనా తమ ఆటగాళ్లకు, పరిస్థితులకు, బలాబలాలకు అనుగుణంగానే క్రికెట్ పిచ్ లను తయారు చేసుకుంటుందని, గతంలో ఏ దేశమైనా భారత ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని పిచ్ లను తయారు చేసిందా? అని రోహిత్ ప్రశ్నించాడు. వారు ఆలోచించకుంటే, మనమెందుకు ఆలోచించాలని రోహిత్ విమర్శించాడు. భారత్ విదేశాల్లో పర్యటిస్తున్న వేళ ఎన్నో సార్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆటగాళ్లు బాగా ఆడితే ప్రతిభను, ఆడకుంటే పిచ్ లను నిందించడం విదేశీ మాజీలకు అలవాటేనని నోరు మూయించే విధంగా వ్యాఖ్యలు చేశాడు రోహిత్. 

 

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

   5 hours ago


హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

   11 hours ago


మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

   a day ago


నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

   03-03-2021


అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

   02-03-2021


స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

   01-03-2021


ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

   28-02-2021


టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

   28-02-2021


ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

   28-02-2021


నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

   27-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle