newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

28-02-202128-02-2021 16:44:30 IST
2021-02-28T11:14:30.703Z28-02-2021 2021-02-28T10:47:28.484Z - - 11-04-2021

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇప్పటి వరకూ రోహిత్ శర్మ అంటే వన్డేలు, టీ20ల్లోనే సూపర్ అనే వారు.. కానీ టెస్ట్ మ్యాచులలో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు. ముఖ్యంగా ఇతర బ్యాట్స్మెన్ లకు ఇబ్బంది పెట్టే పిచ్ లపై రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉన్నాడు. అందుకే ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్నాడు రోహిత్. ఐసీసీ ఆదివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో‌ రోహిత్‌ శర్మ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు.  తన టెస్టు కెరీర్‌లో తొలిసారి టాప్‌ 10లో అడుగుపెట్టిన రోహిత్‌ 742 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా మాత్రం రెండు స్థానాలు దిగజారి 708 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ర్యాంకింగ్‌లో మాత్రం ఏ మార్పు లేదు. 836 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసీస్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. లబుషేన్‌ 878 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 853 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు.

బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 823 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 825 పాయింట్లతో నీల్‌ వాగ్నర్‌(ఆస్ట్రేలియా) రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మాత్రం ఒకస్థానం కోల్పోయి 746 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్‌ అండర్సన్‌ మూడు స్థానాలు దిగజారి 809 పాయింట్లతో 6వ స్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 800 పాయింట్లతో ఏడో స్థానంలో  నిలిచాడు. ఆల్‌రౌండర్‌ విభాగంలో టీమిండియా నుంచి రవీంద్ర జడేజా రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్‌ 5వ స్థానంలో ఉన్నాడు. విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ 407 పాయింట్లతో టాప్‌ లో ఉన్నాడు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle