newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య

06-04-202106-04-2021 16:55:28 IST
2021-04-06T11:25:28.307Z06-04-2021 2021-04-06T11:25:19.753Z - - 11-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సమయంలో టీమిండియా యువ ఆటగాడు పృధ్వీ షా నెట్‌లో అసలు ప్రాక్టీస్ చేయడని, అదే ఫామ్‌లో ఉంటే మాత్రం గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. గత ఐపీఎల్‌లో 13 ఇన్నింగ్స్ ఆడిన పృధ్వీ కేవలం 228 పరుగులు మాత్రమే చేసి 17.53 సగటుతో కుదేలవడం తెలిసిందే.

పృధ్వీ షా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నప్పుడు కొన్ని విషయాల్లో తన శైలిని మార్చుకునేలా తానెంతో కృషి చేశానని పాంటింగ్ చెప్పాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఫామ్‌లో లేనప్పుడు పృధ్వీని నెట్ ప్రాక్టీసుకు తీసుకురాలేకపోయానని అంగీకరించాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో పృధ్వీషాతో ఆసక్తికరమైన చాట్స్ చేశాను. బ్యాటింగ్‌లో లయ తప్పిన అతడిని సరైన దారిలో పెట్టడానికి కోచ్‌గా తన వంతు ప్రయత్నం చేశాను. అతడిలో ఉత్తమ ఆటను తిరిగి బయటకు తీసుకురావాలని ప్రయత్నించాను అని పాంటింగ్ చెప్పాడు. 

అయితే గత సంవత్సరం బ్యాటింగ్‍‌కు సంబంధించి పృధ్వీ ఆసక్తికరమైన విషయం చెబుతూ వచ్చాడు. ఫామ్ లేక పరుగులు చేయలేనప్పుడు ప్రాక్టీసులో కూడా బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడేవాడు కాదు. కానీ పరుగులు సాధించేటప్పుడు మాత్రం చాలా సేపు నెట్ ప్రాక్టీసులో ఉండేవాడు. 

నాలుగైదు గేమ్స్‌లో పది పరుగులకే ఔటవుతూ వచ్చినప్పుడు మనం నెట్స్ వద్దకు వెళ్లి ప్రాక్టీసు చేద్దాం రా అని పిలిచేవాడిని. కానీ నా కళ్లలోకి చూస్తూ లేదు. ఈ రోజు నేను బ్యాటింగ్ చేయను అని మొండికేసేవాడు. ఎంత చేసినా నేను అతడిని ప్రాక్టీసుకు తీసుకురాలేకపోయాను అని పాంటింగ్ చెప్పాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా అడుగుపెట్టిన పృధ్వీషా వరుసగా ఫామ్ కోల్పోవడంతో జట్టులో తన స్థానం కోల్పోయాడు. ఆ సందర్భంలో అతడిపట్ల కఠినంగా వ్యవహరించాను. నెట్స్‌లో ఎంత ఎక్కువగా గడిపితే అంత ఉత్తమంగా రాణించవచ్చు అని పదే పదే బోధించాను. కానీ ఆ విషయంలో మాత్రం అతడు చాలావరకు మొండికేశాడు అని పాటింగ్ బయటపెట్టాడు.

ఇప్పుడు పృధ్వీ తన వైఖరిని మార్చుకోవచ్చు. గత కొన్ని నెలలుగా అతడు చాలా కృషి చేసాడు. తన థియరీనుంచి అతడు బయటపడి ఉండవచ్చు. తనలోని అత్యుత్తమ ఆటతీరును మేం వెలికి తీయగలిగితే అతడు సూపర్ స్టార్ ప్లేయర్ కచ్చితంగా అవుతాడు అని పాంటింగ్ వివరించాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle