newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

సూపర్ ఓవర్ లో విన్ అయిన బెంగళూరు..!

29-09-202029-09-2020 00:13:25 IST
Updated On 29-09-2020 06:59:11 ISTUpdated On 29-09-20202020-09-28T18:43:25.649Z29-09-2020 2020-09-28T18:43:17.129Z - 2020-09-29T01:29:11.634Z - 29-09-2020

సూపర్ ఓవర్ లో విన్ అయిన బెంగళూరు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలు టీ20 మజాను అందించింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడగా.. సూపర్ ఓవర్ లో విజయం కోహ్లీ సేనను వరించింది. 

ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ ముంబైకి ఆ నిర్ణయం కలిసి రాలేదు. బెంగళూరు బ్యాట్స్మెన్ బాగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో  3 వికెట్లకు 201 పరుగులు చేసింది. bఓపెనర్ దేవదత్ పడిక్కల్ 54 (5 ఫోర్లు, 2 సిక్స్ లు), మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 52 (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు సాధించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్ కు 81 పరుగులతో శుభారంభం అందించాడు. చివర్లో ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్ లు), శివం దూబే (10 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్ లు) ధాటిగా ఆడడంతో బెంగళూరు స్కోరు 200 దాటింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, రాహుల్ చహర్ ఓ వికెట్ సాధించారు.

లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. రోహిత్ శర్మ ఎనిమిది బంతులు ఆడి 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. డికాక్ 14 పరుగులు చేయగా.. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే ఇషాన్ కిషన్-పొలార్డ్ జోడీ మ్యాచ్ ను చివరి దాకా తీసుకుని వెళ్ళింది. ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌(60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో మ్యాచ్‌ టై అయ్యింది. చివరి 5 ఓవర్లలో వీరిద్దరూ అద్భుతమైన హిట్టింగ్ చేశారు. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. పొలార్డ్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 

సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా, రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల టార్గెట్  ఇచ్చింది. 

ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. మొదటి రెండు బంతులు.. ఒక్కో పరుగు తీయగా.. మూడో బంతి డాట్ బాల్ అయింది. బుమ్రా మ్యాజిక్ చూడొచ్చని భావించగా.. నాలుగో బంతిని ఫోర్ కొట్టాడు ఏబీడీ.. ఐదో బంతి కాస్తా సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది.  

ధోని-చెన్నై బంధం అలాంటిదని చెబుతున్న గంభీర్

ధోని-చెన్నై బంధం అలాంటిదని చెబుతున్న గంభీర్

   3 minutes ago


హార్దిక్-మోరిస్.. కోహ్లీ కల్పించుకున్నా ఆగని గొడవ.. చివరికి..!

హార్దిక్-మోరిస్.. కోహ్లీ కల్పించుకున్నా ఆగని గొడవ.. చివరికి..!

   36 minutes ago


కోల్‌కతా ఆశలు గల్లంతు.. అదరగొట్టిన చెన్నై

కోల్‌కతా ఆశలు గల్లంతు.. అదరగొట్టిన చెన్నై

   an hour ago


జడేజా సూపర్ ఫినిషింగ్.. ముంబై ప్లే ఆఫ్స్ లోకి

జడేజా సూపర్ ఫినిషింగ్.. ముంబై ప్లే ఆఫ్స్ లోకి

   an hour ago


చెన్నై ముందు 173 పరుగుల టార్గెట్

చెన్నై ముందు 173 పరుగుల టార్గెట్

   12 hours ago


సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

   28-10-2020


సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

   28-10-2020


రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

   28-10-2020


పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

   28-10-2020


రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

   28-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle