newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

23-11-202023-11-2020 12:04:22 IST
2020-11-23T06:34:22.743Z23-11-2020 2020-11-23T06:34:15.968Z - - 16-01-2021

మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గాయల‌తో ఇబ్బందులు ప‌డుతున్న భార‌త ఆట‌గాళ్లు హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, ఇషాంత్ శ‌ర్మ‌లు ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని ఎన్‌సీఏ(నేష‌న‌ల్‌ క్రికెట్ అకాడ‌మీ)లో కోలుకుంటున్నారు. వీరిద్ద‌రు ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కాగా.. మ‌రో మూడు, నాలుగు రోజుల్లో హిట్‌మ్యాన్ రోహిత్‌శ‌ర్మ‌, ఇషాంత్ శ‌ర్మ‌లు ఆసీస్ రావాల‌ని.. లేని ప‌క్షంలో వారిద్ద‌రూ టెస్టు సిరీస్‌లో ఆడే అవ‌కాశాలు క‌ఠినంగా మారుతాయ‌ని టీమ్ఇండియా కోచ్ ర‌విశాస్త్రి అన్నాడు. 

రాహుల్ ద్రావిడ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రోహిత్‌, ఇషాంత్ ఫిట్‌నెస్ సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక వీరిద్ద‌రు ఆసీస్ ఎప్పుడు వెళ‌తారు అనే దానిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. క‌రోనా నేప‌థ్యంలో ఆసీస్‌లో కొవిడ్ నిబంధ‌న‌లు అమలులో ఉన్నాయి. దీంతో భార‌త ఆట‌గాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో రోహిత్‌, ఇషాంత్‌లు మ‌రో మూడు నాలుగు రోజుల్లో ఆసీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్ట‌పోతే.. తొలి వార్మ‌ప్ మ్యాచ్‌లో ఆడేందుకు వీలుండ‌ద‌ని.. త‌ద్వారా టెస్టు సిరీస్‌లో వారు ఆడే అవ‌కాశాలు క‌ష్ట‌త‌రం అవుతాయ‌ని ర‌విశాస్త్రి అన్నాడు.

రోహిత్ శర్మ వైట్ బాల్‌ సిరీస్‌లకు లేడు. అతడు ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే విషయంపై ఎన్‌సీఏ మెడికల్ టీం ఆలోచిస్తున్నారు. కానీ అతడికి ఎక్కువ కాలం విశ్రాంతి కూడా ఇవ్వలేం. టెస్టు సిరీస్‌కు ఆడాలనుకుంటే.. రోహిత్ మూడు నుంచి నాలుగు రోజుల్లో బయలుదేరాలి. లేనిపక్షంలో అవకాశాలు కఠినంగా మారుతాయి. అయితే ఆసీస్‌కు బయలుదేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటే క్వారంటైన్ నిబంధనలతో తర్వాత సవాలుగా మారుతుంది. అప్పుడు టెస్టు సిరీస్‌కు ఆడే అవకాశాలు సంక్లిష్టం అవుతాయి' అని రవిశాస్త్రి తెలిపాడు.

ఇక తొలి టెస్టు అనంత‌రం విరాట్ కోహ్లీ భార‌త్ రానున్నాడు. దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ తీసుకున్న నిర్ణ‌యం స‌రైందేన‌ని తెలిపాడు. అలాంటి మ‌ధుర క్ష‌ణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు. ఆ స‌మ‌యంలో స్వ‌దేశానికి చేరుకున్నందుకు కోహ్లీ ఎంతో సంతోషిస్తాడు. గ‌త ఐదారేళ్లో జ‌ట్టును విజ‌య ప‌థంలో విరాట్ న‌డిపిస్తున్నాడు. అత‌డు లేక‌పోవ‌డం జ‌ట్టుకు లోటే. అయితే.. అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న యువ‌కుల‌కు  ఇది ఎంతో ఉప‌యోగం అని ర‌విశాస్త్రి చెప్పాడు. 

న‌వంబ‌ర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా తొలి డే అండ్ నైట్ టెస్టు ప్రారంభం అవుతుంది. 

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

   17 minutes ago


ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

   2 hours ago


పాండ్యా సోదరులకు పితృ వియోగం

పాండ్యా సోదరులకు పితృ వియోగం

   9 hours ago


భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

   15-01-2021


బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

   15-01-2021


భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

   15-01-2021


ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

   14-01-2021


క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

   14-01-2021


మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

   13-01-2021


అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle