newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

రషీద్ ఖాన్.. ఒకటే బంతికి రెండు విధాలుగా అవుట్

14-10-202014-10-2020 12:49:41 IST
2020-10-14T07:19:41.077Z14-10-2020 2020-10-14T07:19:32.586Z - - 21-10-2020

రషీద్ ఖాన్.. ఒకటే బంతికి రెండు విధాలుగా అవుట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా హిట్ వికెట్ అయిన సంగతి తెలిసిందే. త నెల 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో‌ హార్దిక్ పాండ్యా హిట్‌ వికెట్ గా వెనుదిరిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య అక్టోబర్ 13న జరిగిన మ్యాచ్ లో ఇంకో హిట్ వికెట్ చూశారు క్రికెట్ అభిమానులు. బ్యాట్ ఝుళిపించే క్రమంలో రషీద్ ఖాన్ హిట్ వికెట్ అయ్యాడు. అదే బంతికి క్యాచ్ అవుట్ కూడా అయ్యాడు. ఒకటే బంతికి రెండు విధాలుగా అవుట్ అవ్వడం అంటే ఇదేనేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 17వ నాలుగో బంతికి విజయ్ శంకర్ (12) ఔట్ అయ్యాడు. అప్పుడు రషీద్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ విజయానికిగెలవాలంటే మూడు ఓవర్లలో 46 పరుగులు అవసరం. కర్ణ్‌ శర్మ వేసిన 18వ ఓవర్ మొదటి బంతికి కేన్ విలియమ్సన్ ఫోర్ బాది ఆ తర్వాతి బంతికే భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. రషీద్ మూడో బంతికి సిక్స్, నాలుగో బంతికి ఫోర్.. నదీమ్ చివరి బంతికి మరో ఫోర్ బాదడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 

సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు చేయాలి. 19వ ఓవర్ చేసేందుకు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌కు దిగాడు. మొదటి బంతికి రషీద్ ఖాన్ రెండు పరుగులు చేశాడు. రెండో బంతిని ఠాకూర్ వైడ్ యార్కర్‌గా వేశాడు. ఆ తరువాతి బంతిని కూడా బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వేశాడు. ఆ తర్వాత మరో రెండు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. 

శార్దుల్ ఠాకూర్ చివరి బంతిని లో ఫుల్ టాస్ వేయగా రషీద్ ఖాన్ వికెట్లను దగ్గరగా వెళ్లి భారీ షాట్ ఆడాడు. బ్యాట్‌ను బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అది నేరుగా వెళ్లి లాంగాన్‌లో ఉన్న ఫీల్డర్ దీపక్ చహర్ చేతుల్లో పడింది. దాంతో రషీద్ ఔట్ అయ్యాడని మ్యాచ్ చూస్తున్న వారంతా అనుకున్నారు.  చహర్ క్యాచ్ పట్టకముందే.. రషీద్ ఔట్ అయ్యాడు. షాట్ ఆడే క్రమంలో రషీద్ ఆఫ్ స్టంప్‌ని కాలితో తన్నాడు. అప్పుడే అతడు హిట్‌ వికెట్‌గా ఔట్ అయ్యాడు. చహర్ క్యాచ్ కూడా పట్టడంతో ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయ్యాడన్నమాట. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle