newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా

30-09-202030-09-2020 12:56:24 IST
Updated On 30-09-2020 13:03:51 ISTUpdated On 30-09-20202020-09-30T07:26:24.049Z30-09-2020 2020-09-30T07:26:20.342Z - 2020-09-30T07:33:51.708Z - 30-09-2020

బాధను బయటపెట్టిన రషీద్ ఖాన్.. ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నాయా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హైదరాబాద్‌ జట్టు సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో రాణించి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ (3/14) తన లెగ్‌స్పిన్‌తో ముప్పుతిప్పలు పెడుతూ శ్రేయాస్‌, ధవన్‌, పంత్‌ వికెట్లు తీశాడు. 

రషీద్ ఖాన్ రాగానే ఢిల్లీ హిట్టింగ్ చేయాలి అన్నదే మరచిపోయింది. రషీద్‌ ఖాన్‌ కట్టుదిట్టమైన స్పెల్‌తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. రషీద్‌ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో మూడు వికెట్లు సాధించి 14 పరుగులే ఇచ్చాడు. నాలుగు కంటే తక్కువ ఎకానమీతో మెరిశాడు. శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్‌‌ల వికెట్లను ఖాతాలో వేసుకోవడంతో ఢిల్లీకి విజయం దూరమైంది. రషీద్‌ బౌలింగ్‌తో ఢిల్లీపై ఒత్తిడి పెంచింది సన్‌రైజర్స్‌. మరొక స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చినా రషీద్‌ మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేశాడు. తన ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు రషీద్ ఖాన్. ఈ సందర్భంగా తమ కుటుంబంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న విషాదాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

రషీద్ ఖాన్ తన జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచినప్పుడల్లా వాళ్ల అమ్మగారు చాలా సంతోష పడేవారట. కానీ ఇప్పుడు సంతోషించడానికి అమ్మగారు లేరని కొన్ని నెలల క్రితం చనిపోయిందని తెలిపాడు. గత ఏడాదిన్నర కాలం తనకెంతో కఠిన సమయం అని చెప్పాడు. ముందు తన తండ్రి చనిపోయాడని.. మూడు నాలుగు నెలల క్రితం తన తల్లి మరణించిందని రషీద్ చెప్పాడు.

ఈ బాధ నుంచి బయటకు రావడానికి తనకు సమయం పట్టిందన్నాడు. అందుకే గొప్ప ప్రదర్శన చేయలేకపోయానని చెప్పాడు. అమ్మ నాకు అతిపెద్ద అభిమాని. ముఖ్యంగా ఐపీఎల్ ఆడుతున్నప్పుడు.. నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తే.. ఆ రాత్రంతా నాతో మాట్లాడుతూనే ఉండేది అని చెప్పుకొచ్చాడు రషీద్. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుంటే మ్యాచ్‌పై ప్రభావం చూపుతానని.. అందుకే ప్రశాంతంగా ఉంటూ నేను చేయాల్సిన పని చేశానని అన్నాడు రషీద్. నా బేసిక్స్‌పై దృష్టి సారించి మ్యాచ్‌ను ఆస్వాదించా.. ఎలాంటి బంతులు వేస్తే ఫలితం వస్తుందో తనకు తెలుసునని అన్నాడు రషీద్ ఖాన్. 

రషీద్ ఖాన్ తల్లి ఈ ఏడాది జూన్ 18న మరణించారు. తన తల్లి కోలుకోవాలని ప్రార్థించాలంటూ..రషీద్ ఖాన్ ట్విటర్ వేదికగా అభిమానులను కోరాడు. 2018 డిసెంబర్ చివర్లో రషీద్ ఖాన్ తండ్రి మరణించాడు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle