newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!

30-09-202030-09-2020 09:27:14 IST
Updated On 30-09-2020 10:36:25 ISTUpdated On 30-09-20202020-09-30T03:57:14.401Z30-09-2020 2020-09-30T03:57:10.626Z - 2020-09-30T05:06:25.621Z - 30-09-2020

వింటేజ్ రషీద్ ఖాన్.. దుమ్ము దులిపాడుగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హైదరాబాద్‌ జట్టు సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో రాణించి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ (3/14) తన లెగ్‌స్పిన్‌తో ముప్పుతిప్పలు పెడుతూ శ్రేయాస్‌, ధవన్‌, పంత్‌ వికెట్లు తీశాడు. 

రషీద్ ఖాన్ రాగానే ఢిల్లీ హిట్టింగ్ చేయాలి అన్నదే మరచిపోయింది. రషీద్‌ ఖాన్‌ కట్టుదిట్టమైన స్పెల్‌తో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. రషీద్‌ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో మూడు వికెట్లు సాధించి 14 పరుగులే ఇచ్చాడు. నాలుగు కంటే తక్కువ ఎకానమీతో మెరిశాడు. శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్, రిషభ్‌ పంత్‌‌ల వికెట్లను ఖాతాలో వేసుకోవడంతో ఢిల్లీకి విజయం దూరమైంది. రషీద్‌ బౌలింగ్‌తో ఢిల్లీపై ఒత్తిడి పెంచింది సన్‌రైజర్స్‌. మరొక స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చినా రషీద్‌ మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేశాడు. షాట్ లకు ప్రయత్నించిన ముగ్గురు ఢిల్లీ స్టార్ బ్యాట్స్మెన్ కాస్తా వికెట్లను సమర్పించుకున్నారు. 

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), వార్నర్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), విలియమ్సన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లతో 41) రాణించారు. రబాడ, మిశ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి ఓడింది. ధవన్‌ (34), పంత్‌ (28) ఓమాదిరిగా ఆడారు. భువీకి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రషీద్‌ ఖాన్‌ నిలిచాడు.

న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన అతను నబీ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. 157.69 స్ట్రయిక్‌ రేట్‌తో రైజర్స్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించడంలో కేన్‌ కీలకపాత్ర పోషించాడు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle