newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

నేను చెత్తగా ఆడిన మొదటి 20 బంతులు అవే..!

28-09-202028-09-2020 10:13:53 IST
Updated On 28-09-2020 10:24:31 ISTUpdated On 28-09-20202020-09-28T04:43:53.035Z28-09-2020 2020-09-28T04:43:44.305Z - 2020-09-28T04:54:31.771Z - 28-09-2020

నేను చెత్తగా ఆడిన మొదటి 20 బంతులు అవే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాహుల్ తెవాటియా.. రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నంత సేపూ అతడి గురించే ప్రస్తావన..! మొదట ఎంతో చెత్తగా బ్యాటింగ్ ఆడాడు.. రన్ రేట్ కొండలా పెరిగిపోతూ ఉన్నా.. అతడు మాత్రం డాట్ బాల్ మీద డాట్ బాల్ ఆడుతూ వెళ్ళిపోయాడు. కొడితే కొట్టమనండి.. లేదంటే అవుట్ అయి వెళ్ళిపోమనండి అంటూ కామెంట్రేటర్లు కూడా అతడి బ్యాటింగ్ ను తీవ్రంగా విమర్శించారు.

ఒకానొక సమయంలో సంజూ శాంసన్ అతడికి స్ట్రైక్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోడు..! కానీ చివర్లో అతడు ఒకే ఒక్క ఓవర్ లో మ్యాచ్ ను మలుపు తిప్పేశాడు. ఆఖర్లో కాట్రెల్‌ బౌలింగ్‌ లో తెవాటియా  6, 6, 6, 6, 0, 6 లాంగ్‌లెగ్, బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్, లాంగాఫ్, మిడ్‌ వికెట్, బంతి గ్యాప్‌ తర్వాత మళ్లీ మిడ్‌ వికెట్‌ల మీదుగా మొత్తం 5 సిక్స్‌లు బాది మ్యాచ్ స్వరూపాన్నే కాదు.. తన మీద పడిన మచ్చను కూడా చెరిపేశాడు. 

ఈ ఇన్నింగ్స్ తర్వాత తెవాటియా తన బ్యాటింగ్ గురించి మాట్లాడాడు. నేను చెత్తగా ఆడిన మొదటి 20 బంతులు అవే అని చెప్పుకొచ్చాడు. నెట్స్ లో బంతిని బాగా కొట్టేవాడిని.. కానీ ఈ ఇన్నింగ్స్  మొదట్లో అది కుదరలేదు.. కానీ నా మీద నమ్మకం ఉంది. నేను కొట్టగలను అన్న నమ్మకం డగౌట్ లో వాళ్ళకు కూడా ఉంది.. ఎందుకంటే నేను బంతిని బలంగా బాదగలను అని వారికి కూడా తెలుసు అని తెవాటియా చెప్పాడు.

నా మీద నాకు నమ్మకం ఉంది.. ఒక్క సిక్సర్ కొడితే చాలు.. ఆ తర్వాత మరిన్ని కొట్టగలను అని భావించాను.. అయిదు సిక్సర్లు కొట్టడం అన్నది గొప్పగా సాగింది.. ఆఫ్ స్పిన్నర్ కు సిక్సర్ బాదగలను అని నమ్మి కోచ్ నన్ను ముందుగా పంపాడు.. కానీ అనుకున్నట్లుగా జరగలేదు.. అందుకే ఇతర బౌలర్లను టార్గెట్ చేసి సిక్సర్లను కొట్టాను అని చెప్పాడు తెవాటియా.     

ధోని-చెన్నై బంధం అలాంటిదని చెబుతున్న గంభీర్

ధోని-చెన్నై బంధం అలాంటిదని చెబుతున్న గంభీర్

   6 minutes ago


హార్దిక్-మోరిస్.. కోహ్లీ కల్పించుకున్నా ఆగని గొడవ.. చివరికి..!

హార్దిక్-మోరిస్.. కోహ్లీ కల్పించుకున్నా ఆగని గొడవ.. చివరికి..!

   39 minutes ago


కోల్‌కతా ఆశలు గల్లంతు.. అదరగొట్టిన చెన్నై

కోల్‌కతా ఆశలు గల్లంతు.. అదరగొట్టిన చెన్నై

   an hour ago


జడేజా సూపర్ ఫినిషింగ్.. ముంబై ప్లే ఆఫ్స్ లోకి

జడేజా సూపర్ ఫినిషింగ్.. ముంబై ప్లే ఆఫ్స్ లోకి

   an hour ago


చెన్నై ముందు 173 పరుగుల టార్గెట్

చెన్నై ముందు 173 పరుగుల టార్గెట్

   12 hours ago


సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

   28-10-2020


సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

   28-10-2020


రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

   28-10-2020


పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

   28-10-2020


రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

   28-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle