newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

12-04-202112-04-2021 16:01:14 IST
Updated On 12-04-2021 10:01:23 ISTUpdated On 12-04-20212021-04-12T10:31:14.121Z12-04-2021 2021-04-12T02:39:08.448Z - 2021-04-12T04:31:23.329Z - 12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'ఇందిరా నగర్ కా గూండా' అంటూ భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ నటించిన ఓ యాడ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో రాహుల్ ద్రావిడ్ ట్రాఫిక్ లో గొడవ పడడాన్ని చూడొచ్చు. ట్రాఫిక్ లో విపరీతమైన చిరాకుతో బ్యాట్ తీసుకుని అద్దాలను పగులగొట్టడం, పలువురి మీద అరవడం, రారా తేల్చుకుందాం అంటూ విపరీతమైన కోపాన్ని ప్రదర్శించాడు. ద్రావిడ్ ఎప్పుడు కూడా కోప్పడడం చూడలేని వారు ఈ యాడ్ ను చూసి అవాక్కయ్యారు.

బ్యాట్‌ చేతపట్టి హల్‌చల్ చేశాడు. తొలుత తన కారుపైనే కోపాన్ని ప్రదర్శించిన ద్రావిడ్.. ఆ తరువాత తన కారు పక్కన ఉన్నవారిని సైతం బెదిరించాడు. నువ్ రారా చూసుకుందాం.. అంటూ ఊగిపోయాడు.. ఒక కారుకి సైడ్ మిర్రర్‌ను ధ్వంసం చేశాడు. రాహుల్ ద్రావిడ్ చర్యతో రోడ్డుపై ఉన్న వాహనదారులంతా హడలిపోతారు. ద్రావిడ్ కు కోపం కూడా వస్తుందా..? కోపం వస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా అని కూడా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ద్రావిడ్ కు యాంగర్ ఇష్యూ ఉందని అనుకునేలా ఈ యాడ్ ను రూపొందించారు. అయితే ద్రావిడ్ కోపాన్ని తాను ఇంతకు ముందే చూశానని.. భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అది కూడా మహేంద్ర సింగ్ ధోని మీద అని చెప్పుకొచ్చాడు. 

వీరేందర్ సెహ్వాగ్ 2006లో పాకిస్థాన్ లో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆసక్తికర ఘటన గురించి చెప్పుకొచ్చాడు. ధోనీ అప్పుడే జట్టులోకి వచ్చాడని, ఓ మ్యాచ్ లో చెత్తగా ఆడి అవుట్ అయి పెవీలియన్ కు వచ్చిన ధోనీని చూసిన ద్రావిడ్ కు చిర్రెత్తుకొచ్చి, "నువ్వు ఇలాగేనా ఆడాల్సింది. మ్యాచ్ ని నువ్వే ముగించి ఉండాల్సింది" అంటూ కోపంతో ఇంగ్లీషులో చాలా తిట్టేశాడని.. ద్రావిడ్ ఇంగ్లీషులో తనకు సగం మాత్రమే అర్థమైందని సెహ్వాగ్ చెప్పాడు. ఆ తరువాతి మ్యాచ్ లో ధోనీ భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ ఉండటంతో, తాను ఏమైందని, ఎందుకలా ఉన్నావని అడిగానన్నాడు. మరోసారి ద్రావిడ్ తో తిట్టించుకోవాలని తాను భావించడం లేదని చెప్పిన ధోనీ, తాను నిదానంగా ఆడుతూ మ్యాచ్ ని ముగించే వెళ్తానని చెప్పాడని అప్పటి ఘటన గురించి వెల్లడించాడు. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle