అడ్డుగోడలా అశ్విన్, విహారి.. మూడో టెస్టులో చారిత్రాత్మక డ్రా
11-01-202111-01-2021 23:10:46 IST
2021-01-11T17:40:46.053Z11-01-2021 2021-01-11T17:40:42.783Z - - 21-01-2021

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్టు చారిత్రాత్మక డ్రాగా ముగిసింది. ఎనిమిది వికెట్లు మిగిలి 97 ఓవర్లు పూర్తి ఆటకు సిద్ధమైన భారత్ జట్టు ఛేదనలో తనపై ఉన్న అన్ని రకాల అపప్రథలను తోసిరాజంటూ నిలబడి ఓటమి తప్పదనుకున్న చోటే నిలబడి గెలిచింది. గెలుపు అంటే విజయం కాదు. కానీ దుర్భేద్యమైన ఆసీస్ బౌలింగ్‌ను ఒక రోజు పొడవునా నిలవరించి అడ్డుకోవడం ఏ రకంగా చూసినా విజయంతో సమానమే. పైగా చివర్లో అశ్విన్, విహారి నిజమైన అడ్డుగోడల్లాగా నిలిచి భారత్‌కు చారిత్రాత్మక డ్రాను అందించండంలో చిరస్మరణీయమైన పాత్ర పోషించారు. అసాధ్యమనుకున్న 407 పరుగుల ఛేదనను ఆదివారం నాలుగోరోజు సాయంత్రం ధీటుగానే ఎదుర్కొన్న భారత్ సోమవారం నిజంగానే విశ్వరూపం చూపింది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేయడమే ఒక గొప్పకాగా ఆసీస్ ఎలా ఆటను తన్నుకుని పోతుందో చూద్దామన్న కసితో టీమిండియా మొత్తంగా బాధ్యతగా ఆడింది. ఆదివారం రిషభ్ పంత్ 97 పరుగులతో ఆసీస్ బౌలింగ్‌ను ఆడుకోగా రెండో వాల్‌గా పేరొందిన చటేశ్వర్ పుజారా 77 పరుగులు, రోహిత్ శర్మ 52 పరుగులు, అశ్విన్ 39 పరుగులు, విహారి 23 పరుగులు సాధించి ఆటను నిలబెట్టారు. ఓటమి తప్పదనుకున్న చోట కలకాలం గుర్తుంచుకునేలా మూడోటెస్టును డ్రాగా ముగించి విజయనాదం చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఆటను డిక్లేర్ చేసిన ఆసీస్ జట్టు ఒకటిన్నర రోజు ఆట మిగిలివుంది కాబట్టి విజయం నల్లేరు బండిపై నడకే అనుకుంది. కాని అయిదోరోజు ఉదయం చటేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ సెంచరీ పరుగుల స్టాండ్‌తో భారత్‌ను గెలుపుతీరాలను చేరువగా తీసుకొచ్చారు కానీ, సోమవారం ఆట మొత్తంలో రవిచంద్రన్ అశ్విన్, హనమ విహారిలను ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఇంకా 40 ఓవర్ల పైబడిన ఆట మిగిలి వున్న తరుణంలో, ఆసీస్ బౌలర్లు రెండో కొత్త బాల్ తీసుకున్న ప్రమాదకర క్షణాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే, ఆసీస్ బౌలర్ల బంతి గాయాలను తట్టుకుంటూనే చివరివరకూ నిలిచి భారత్‌ను ఓటమినుంచి తప్పించారు. చివరి రెండు సెషన్లలో ఆసీస్ బౌలర్లు ఎంతగా తేలిపోయారంటే 40 ఓవర్లపైగా బౌలింగ్ చేసి కూడా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. స్పిన్నర్ నాథన్ లియోన్ 46 ఓవర్లు నిరవధికంగా బౌల్ చేశాడు. పాట్ కమ్మిన్స్ రోజంతా పిచ్‌పై ఆడుకున్నాడు. జోష్ హజిల్ వుడ్ రివర్స్ స్వింగ్‌తో భయపెట్టాడు. కానీ ఈ ముప్పేట దాడికి ఎదురొడ్డి నిలిచిన అశ్విన్, విహారి జంట అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గాయంతో పరుగెత్తలేకపోయిన విహారి మూడుగంటలపైగా బ్యాటింగ్ చేసి 161 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక అశ్విన్ తన అనుభవాన్నంతటినీ రంగరించిపోసి 128 బంతుల్లో 39 పరుగులు చేసి ఆటను నిలబెట్టాడు. ఆసీస్ కెప్టెన్ జారవిడిచిన మూడు క్యాచ్‌లతో సహా చివరి రోజు నాలుగు క్యాచ్‌లను ఆసీస్ జట్టు మిస్ చేసినందుకు ఫలితం అనుభవించింది. ఈ క్రమంలో నాలుగో ఇన్నింగ్స్‌లో మూడో అతిపెద్ద ఆరవ వికెట్‌కు స్టాండ్‌కు గాను రికార్డు సృష్టించింది. కాగా 1979 తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో 132 ఓవర్లు చేసి ఔట్ కాకుండా నిలబడటం భారత జట్టు ఇదే మొదటిసారి,. అంతకుముందు పుజారా తోడుగా దాడి మొదలెట్టిన రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. వీరిద్దరి మధ్య 148 పరుగుల భాగస్వామ్యం ఆటను ఒక్కసారిగా భారత్ వైపు తీసుకొచ్చింది. అజింక్యా రహానే స్వల్ప పరుగులకే నాథన్ బౌలింగులో ఔట్ కావడంతో దాడే ఫరిష్కారం అనేలా భారత జట్టు రిషభ్‌ను అయిదో స్థానంలో దింపిదంది. సరిగ్గా తన లక్ష్యాని నాథన్‌పై గురిపెట్టడం ద్వారా ప్రారంభించిన రిషభ్ మర్చిపోలేని ఆటను ప్రదర్సించాడు. దీంతో ఆసీస్ బౌలర్లను మార్చి మార్చి ఆడినా సరే చివరి 40 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా చేజిక్కించుకోలేకపోయింది. 3 వికెట్ల నష్టానికి 102 పరుగుల వద్ద మైదానంలోకి వచ్చిన పంత్ తొలి 33 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి నెమ్మదైన ఆటను ప్రదర్సించాడు. అప్పటికే మోచేతికి గాయమైన పంత్ అయిదో రోజు ఆటలోనూ కమ్మిన్స్ బౌలింగ్‌లో పలుసార్లు బంతి శరీరానికి తగిలి ఇబ్బందిపడ్డాడు. జట్టును నిలబెట్టి డ్రాగా ముగించడంలో రిషభ్ పంత్కి కీలకపాత్ర. ఇకపోతే టెస్టుల్లో 27వ అర్ధ సెంచరీని సాధించి పుజారా ఇంతవరకు టెస్టు ఫార్మాట్లో 6 వేల పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. కొత్త బంతి తీసుకున్న తర్వాత కూడా పాట్ కమ్మిన్స్ బౌలింగులో పంత్ లాగే వరుసగా మూడు ఫోర్లు బాదిన పుజారా జట్టు అవసరాలకు అనుగుణంగా నూటికి నూరుపాళ్లు ఉత్తమ ఆట ప్రదర్శించాడు.

ఐపీఎల్ 2021 కౌంట్ డౌన్ మొదలైంది.. ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకుంది ఎవరినంటే
5 hours ago

శుభమన్ గిల్ తండ్రి బాధ అదొక్కటే.. సెహ్వాగ్ కౌంటర్..!
17 hours ago

టీమిండియాను.. ఇకెన్నడూ తక్కువగా అంచనా వేయం.. ఆసీస్ కోచ్ లాంగర్
20-01-2021

ఉద్వేగానికి లోనైన రవి శాస్త్రి.. అద్భుత విజయంపై రహానే ఏమన్నాడంటే
19-01-2021

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక
19-01-2021

టీమిండియా గెలుపు దేశానికి గర్వకారణం.. మోదీతో సహా దిగ్గజాల ప్రశంసలు
19-01-2021

యువ ఇండియా సాధించిన అద్భుత విజయం.. గవాస్కర్ వ్యాఖ్య
19-01-2021

బ్రిస్బేన్ టెస్ట్.. వర్షం వస్తుందా.. ఫలితం వస్తుందా..?
18-01-2021

భారత ఆటతీరుకు ఫిదా అవుతున్న క్రికెట్ లెజెండ్స్
17-01-2021

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్
16-01-2021
ఇంకా