newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

పీఎస్ఎల్ విజేతగా కరాచీ.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవుతారు

18-11-202018-11-2020 15:28:15 IST
Updated On 18-11-2020 15:50:27 ISTUpdated On 18-11-20202020-11-18T09:58:15.705Z18-11-2020 2020-11-18T09:58:08.650Z - 2020-11-18T10:20:27.489Z - 18-11-2020

పీఎస్ఎల్ విజేతగా కరాచీ.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవుతారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా వాయిదా పడ్డ క్రికెట్ టోర్నమెంట్స్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా ఒకటి. మార్చిలో పూర్తవ్వాల్సిన ఈ టీ20 లీగ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను నవంబర్ లో పూర్తీ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్‌తో పీఎస్‌ఎల్ 2020 సీజన్‌ ముగిసింది. ఈ సీజన్ లో కరాచీ కింగ్స్ విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో కరాచీ కింగ్స్ తొలిసారి టైటిల్ ను అందుకుంది. లాహోర్ ఖలందర్స్‌ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో కరాచీ విజయంలో కీలక పాత్ర పోషించిన బాబర్ ఆజామ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 35) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది లాహోర్. కరాచీ బౌలర్లలో మక్సూద్, అర్షద్, ఆసిఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి 8 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది.

IPL 2020: ముంబై ఐదో సారి.. ఫైనల్ లోనూ వార్ వన్ సైడ్..!

కరాచీ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా విఫలమవడంతో ఓ దశలో లాహోర్ విజయం సాధించేలా కనిపించింది. షర్జీల్ (13), అలెక్స్ హేల్స్ (11), ఇఫ్తికర్ అహ్మద్ (4), రూథర్‌ఫర్డ్ (0) విఫలమయ్యారు. లక్ష్యం మరీ ఎక్కువగా లేకపోవడంతో బాబర్ అజామ్ (49 బంతుల్లో 7 ఫోర్లతో 63 నాటౌట్) చివరి వరకూ క్రీజులో నిలవడంతో మొదటిసారి టైటిల్ ను అందుకుంది కరాచీ కింగ్స్. పీఎస్‌ఎల్ 2020 విజేతగా నిలిచిన కరాచీ కింగ్స్ జట్టుకు రూ.3.75 కోట్లు.. రన్నరప్‌గా నిలిచిన లాహోర్ ఖలందర్స్ జట్టు‌కు రూ.1.5 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది.

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   11 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle