newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా

09-04-202109-04-2021 17:41:06 IST
2021-04-09T12:11:06.535Z09-04-2021 2021-04-09T11:09:40.879Z - - 15-05-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేటినుంచి ప్రారంభం కానున్న 2021 ఐపీఎల్ టోర్నకి ముంబై ఇండియన్స్ సర్వసన్నద్ధమైన జట్టుగా కనిపిస్తోందని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా విశ్వాసం ప్రకటించాడు. అయితే వరుసగా మూడోసారి కూడా టైటిల్ గెల్చుకుకోవాలనే తపనతో జట్టు మరీ అతి విశ్వాసంతో వ్యవహరించవద్దని ఓజా హెచ్చరించాడు.

నా దృష్టిలో ముంబై ఇండియన్స్ జట్టు సర్వసన్నద్దమై వచ్చిన సంపూర్ణ జట్టుగా వచ్చినట్లు కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వారు పెద్దగా మారింది లేదు. ఈ ఏడాది వేలంలో కూడా వారు ఖాళీల భర్తీకోసం మాత్రమే చూశారు. 

ఒక జట్టుగా ముంబై ఇండియన్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తోస్తోంది. చాలా దృఢమైన జట్టుగా కనిపిస్తున్నారు. 2019, 2020 సంవత్సరాల్లో వరుసగా టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ ఇప్పటికీ అదే ఊపులో, చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్లుంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే పర్వాలేదు కానీ అతి విశ్వాసం పనికిరాదు అంటూ ఓజా హెచ్చరించాడు.

జట్టు సభ్యులు ఎలా కలిసి కట్టుగా ఆడతారు అనేదే ముఖ్యమని ప్రతి టోర్నమెంట్ ప్రాంరంభానికి ముందు నేను చెబుతూ వస్తున్నాను. మీకు 11 మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉండవచ్చు. కానీ టీమ్‌గా వారు పెద్దగా సాధించలేరు. ఎందుకంటే తమలో ఒకరినొకరు తెలుసుకోవడంలో వారికి పెద్దగా సమయం ఉండకపోయి ఉండవచ్చు అని ఓజా వ్యాఖ్యానించాడు..

ఐపీఎల్‌లో అతిపెద్ద సవాల్ ఏమిటంటే, జట్టులో ప్రతి ఒక్కరూ ఎలా కలిసిపోతారు అన్నదే. సభ్యులందరూ ఎలాంటి ఫామ్‌లో ఉంటున్నారు, వారు ఎలాంటి మానసిక సామర్థ్యంతో ఉంటున్నారు అనేది జట్టు పొందికలో కీలకమైన విషయం అని ఓజా చొప్పుకొచ్చాడు. 

కాగా 2012 నుంచి 2015 వరకు ముంబై ఇండియన్స్ జట్టు తరపున నాలుగు సీజన్లపాటు ఆడిన ఓజా జట్టుతో కలిసి రెండు సార్లు టైటిల్ గెలుచుకున్నాడు.

కాగా 2021 ఐపీఎల్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంఫియన్ ముంబై ఇండియన్స్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో నేడు తలపడనుంది. ఈసారి టైటిల్‌పై చాలు జట్లు కన్నేశాయి కానీ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు గత రెండేళ్లుగా టైటిల్ గెల్చిన అనుభవంతో ఇతర జట్లపై పూర్తి ఆధిపత్యం చలాయించేటట్టు కనిపిస్తోంది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle