newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

బుమ్రాకు కొత్త బంతిని ఎందుకు ఇచ్చానో చెప్పిన పోలార్డ్

24-10-202024-10-2020 11:21:49 IST
2020-10-24T05:51:49.727Z24-10-2020 2020-10-24T05:51:36.611Z - - 29-11-2020

బుమ్రాకు కొత్త బంతిని ఎందుకు ఇచ్చానో చెప్పిన పోలార్డ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మీద ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరమవ్వడంతో పోలార్డ్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకున్నాడు పోలార్డ్. ఇక ముంబై బౌలర్లు అద్భుతమైన బంతులతో చెన్నై బ్యాట్స్మెన్ ను ముప్పతిప్పలు పెట్టారు. ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్‌ల దెబ్బకు పవర్‌ ప్లే ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (0),  డుప్లెసిస్‌(1), అంబటి రాయుడు(2), జగదీశన్‌(0), ఎంఎస్‌ ధోని(16), జడేజా(7)లు ఘోరంగా విఫలమయ్యారు. గైక్వాడ్‌, డుప్లెసిస్‌లను బౌల్ట్‌ ఔట్‌ చేయగా, రాయుడు, జగదీశన్‌లను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జడేజాను బౌల్ట్‌ ఔట్‌ చేయగా,  రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో ధోని నిష్ర్కమించాడు. ఏడు ఓవర్లలోనే సీఎస్‌కే ఆరు వికెట్లు కోల్పోగా, పవర్‌ ప్లే ముగిసే సరికి ఐదు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా చెత్త రికార్డును సీఎస్‌కే మూటగట్టుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కే పవర్‌ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే మొదటిసారి.  శామ్ కరణ్ 47 బంతుల్లో 52 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) అద్భుతమైన బౌలింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్‌కే 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది.

ఈ మ్యాచ్ లో బుమ్రా సాధారణంగా బౌలింగ్ వేసే సమయం కంటే ముందుగానే బౌలింగ్ వేశాడు. రెండో ఓవర్ లోనే బుమ్రా చేతికి బౌలింగ్ ఇవ్వడంపై పోలార్డ్ స్పందించాడు. 'బౌలర్లు రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. బౌలింగ్ యూనిట్ సత్తా నిరూపించుకోవాలని ముందుగానే అనుకున్నాం. ఇద్దరు మెయిన్ బౌలర్లతో బౌలింగ్ వేయించాలని అనుకున్నాం. అయితే బుమ్రాతో రెండో ఓవర్ బౌలింగ్ వేయించాలని మొదట అనుకోలేదు. ట్రెంట్ బౌల్ట్ మొదట్లోనే వికెట్ తీయడం.. ఇంతకు ముందు మ్యాచ్ లో అంబటి రాయుడు మా మీద అద్భుతంగా ఆడడంతో బుమ్రాను బౌలింగ్ చేయడానికి తీసుకుని రావాలని అనుకున్నాము. ఆ ప్రయోగం ఫలించింది. మొదట బౌల్ట్, కోల్టర్ నైల్ తోనూ, ఆ తర్వాత స్పిన్నర్ తో కానీ బౌలింగ్ వేయించాలని భావించాం. బంతి స్వింగ్ అవుతూ ఉండడం.. బౌల్ట్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ తీయడం.. రాయుడు బ్యాటింగ్ కు రావడంతో అనుభవజ్ఞుడైన బుమ్రాను బౌలింగ్ కు తీసుకుని వచ్చాం' అని పోలార్డ్ చెప్పుకొచ్చాడు. 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   12 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle