newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

06-05-202106-05-2021 09:57:27 IST
2021-05-06T04:27:27.606Z06-05-2021 2021-05-06T02:10:21.892Z - - 14-06-2021

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఢిల్లీలో ఓ రెజ్లర్ మరణంపై పోలీసు  అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఓ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు సుశీల్ కుమార్ పై కూడా అభియోగాలు మోపారు. ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తి ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడు. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద గత రాత్రి జరిగిన ఘర్షణలో  ఓ రెజ్లర్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో భారత ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పాత్ర ఉందా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఢిల్లీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ రెజ్లర్ మరణించాడు. రాజధానిలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద మంగళవారం రాత్రి రెండు వర్గాల రెజ్లర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ వర్గం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన రెజ్లర్లను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాగర్ కుమార్ అనే 23 ఏళ్ల జాతీయ స్థాయి మాజీ రెజ్లర్ మరణించాడు. ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్, అతడి సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 

ఈ ఘటనకు, తనకు ఎలాంటి సంబంధం లేదని సుశీల్ కుమార్ తెలిపాడు. సుశీల్ కుమార్ కోసం పలు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని అదనపు డీసీపీ డాక్టర్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ తెలిపారు. సుశీల్ కుమార్,  అతడి సన్నిహితులే ఈ నేరానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కొడుకైన సాగర్ కుమార్ గా, గాయపడిన మరో వ్యక్తిని సోను మహల్ గా గుర్తించినట్టు పోలీసులు చెబుతున్నారు. 

సుశీల్ కుమార్ కు చెందిన ఈ స్టేడియం బయట ఓ ఇంటిలో సాగర్ కుమార్ తో సహా మరో ఇద్దరు ఉండగా వారిని వెళ్లిపోవాలని సుశీల్ కుమార్ కోరాడని తెలుస్తోంది. కానీ ఏం జరిగిందో గానీ పరిస్థితి ఘర్షణకు దారి తీయగా సాగర్ కుమార్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందినట్టు తెలిసింది. వారెవరో తనకు తెలియదని, ఈ ఘటన చాలా పొద్దుపోయిన తరువాత జరిగిందని సుశీల్ కుమార్ చెబుతున్నారు. వారు ఘర్షణకు దిగినట్టు తెలియడంతో సమాచారాన్ని తాను పోలీసులకు తెలియజేశానని అన్నారు. తన స్టేడియానికి, ఈ ఘటనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు సుశీల్.  దాడి చేసిన వ్యక్తులు అసలు రెజ్లర్లే కాదని అన్నారు సుశీల్ కుమార్. సుశీల్ కుమార్ 2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో రజత పతకాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..! 

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

   9 hours ago

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

   13-06-2021

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

   12-06-2021

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

   11-06-2021

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

   10-06-2021

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

   10-06-2021

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

   09-06-2021

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

   08-06-2021

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

   07-06-2021

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

   06-06-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle