newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక మ్యాచ్ ఫిక్సర్ కెప్టెన్.. మ్యాచ్ లను నిర్వహించనివ్వం

21-02-202121-02-2021 09:07:55 IST
Updated On 22-02-2021 10:38:17 ISTUpdated On 22-02-20212021-02-21T03:37:55.161Z21-02-2021 2021-02-21T03:37:51.202Z - 2021-02-22T05:08:17.409Z - 22-02-2021

సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక మ్యాచ్ ఫిక్సర్ కెప్టెన్.. మ్యాచ్ లను నిర్వహించనివ్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ అంటే భారత్ లోని యంగ్ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేసే ఒక టోర్నీ అని చెబుతూ ఉంటారు. ఈ టోర్నీ నుండి ఎంతో మంది స్టార్స్ వచ్చారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా, నటరాజన్ వంటి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో నిరూపించుకుని భారతజట్టుకు ఆడారు. చాలా ఫ్రాంచైజీలు దేశవాళీ మ్యాచ్ లలో రాణిస్తున్న ఆటగాళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి.. వేలంపాటలో కొనుక్కుంటూ ఉంటారు. ఈ ఏడాది కూడా ఐపీఎల్ వేలంపాట జరిగింది. కొందరు ఆటగాళ్లను కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. చిన్న చిన్న పట్టణాలకు చెందిన ఆటగాళ్లను కూడా తీసుకున్నారు. ఇక మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక్క హైదరాబాద్ ఆటగాడిని కూడా కొనుగోలు చేయలేదదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఒక్క హైదరాబాదీ ప్లేయర్ లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కామెంట్ చేశారు.

ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టీంలో స్థానిక ఆటగాళ్లు లేకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జట్టుకు మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికిన ఆటగాడు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడని.. స్థానిక ప్లేయర్స్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో స్థానిక ఆటగాళ్లను తీసుకోవాలని.. లేకపోతే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. జట్టులో హైదరాబాద్ ఆటగాళ్లకు స్థానం లేనప్పుడు ఎస్‌ఆర్‌హెచ్ పేరు వెంటనే మార్చాలంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో స్థానిక ఆటగాళ్లను తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాదులో సత్తా కలిగిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని ఆయన చెప్పారు.

ఐపీఎల్‌ 2021 వేలంలో ఎస్ఆర్‌హెచ్‌ ముగ్గురు క్రికెటర్ల‌ను మాత్ర‌మే త‌న జ‌ట్టులో చేర్చుకోగ‌లిగింది. వేలంలో హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లను ఒక్కరిని కూడా తీసుకోలేదు. గతేడాది భావనక సందీప్‌ను తీసుకున్న హైదరాబాద్ ఈ సారి అతన్ని వదిలేసింది. హైదరాబాద్‌కి చెందిన స్పిన్నర్ భగత్ వర్మ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ పట్టించుకోలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధరకే అతడ్ని తీసుకుంది. ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్‌ భరత్‌ను కనీస ధర రూ. 20 లక్షలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, హరిశంకర్‌ రెడ్డిని కనీసం ధర రూ. 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేశాయి.

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

   5 hours ago


హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

   11 hours ago


మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

   a day ago


నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

   03-03-2021


అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

   02-03-2021


స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

   01-03-2021


ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

   28-02-2021


టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

   28-02-2021


ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

   28-02-2021


నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

   27-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle