newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

వికెట్ పడకుండా ఆడాడు.. విజయం సాధించి పెట్టాడు..

27-03-202227-03-2022 22:20:21 IST
2022-03-27T16:50:21.260Z27-03-2022 2022-03-27T16:50:15.714Z - - 08-08-2022

వికెట్ పడకుండా ఆడాడు.. విజయం సాధించి పెట్టాడు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీ ట్వంటీ మ్యాచ్ అంటేనే బ్యాటింగ్ లో ఒక్క బాల్ ని కూడా వెస్ట్ చేయకుండా ఫోర్లు, సిక్సర్లు బాదెందుకు బ్యాట్స్ మెన్ లు ఆరాట పడుతుంటారు. ఒక్క డాట్ బాల్ పడింది అంతే ప్రేక్షకులు సైతం ఊరుకోరు. అలాంటిది తన వికెట్ పడకుండా నిమ్మడిగా ఆడి ఢిల్లీ క్యాపిటల్స్‌ కి గెలుపులో కీలక పాత్ర పోషించాడు లలిత్‌ యాదవ్‌. ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక దశలో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అప్పటికి క్రీజులో ఉ‍న్న లలిత్‌ యాదవ్‌ కాస్త నెమ్మదిగా ఆడాడు.  కానీ ఆ నెమ్మదైన ఆటే ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయం కట్టబెట్టిందంటే అతిశయోక్తి కాదు. మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌(17 బంతుల్లో 38, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి మ్యాచ్‌ హీరోగా నిలిచినప్పటికి.. పరోక్షంగా లలిత్‌ యాదవ్‌ ప్రధాన పాత్ర పోషించాడు.

పంత్‌ సహా టాపార్డర్‌ విఫలమైన దశలో క్రీజులోకి వచ్చిన లలిత్‌ యాదవ్‌ అసమాన పోరాటం కనబరిచాడు. పరుగుల కంటే క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఓవరాల్‌గా లలిత్‌ యాదవ్‌ ‌( 38 బంతుల్లో 48, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ దశలో లలిత్‌కు అక్షర్‌ పటేల్‌ జత కలిశాడు. అక్షర్‌ వచ్చి ఆట గేర్‌ను పూర్తిగా మార్చేశాడు. ముంబై బౌలర్లను బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న అక్షర్‌ వారికి ఏమాత్రం అవకాశమివ్వకుండా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా లలిత్‌ యాదవ్‌ ఆటతీరును క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభినందించారు. ఏం ఆడుతున్నావు అని విమర్శించినోళ్లే లలిత్‌ యాదవ్‌ ఆటపై ప్రశంసలు కురిపించారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle