పాండ్యా సోదరులకు పితృ వియోగం
16-01-202116-01-2021 11:47:16 IST
Updated On 16-01-2021 12:22:11 ISTUpdated On 16-01-20212021-01-16T06:17:16.260Z16-01-2021 2021-01-16T06:17:12.013Z - 2021-01-16T06:52:11.784Z - 16-01-2021

టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ఆడుతున్న కృనాల్ పాండ్యా బయో బబుల్ ను వీడి ఇంటికి చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిశాక స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే..!
పాండ్యా సోదరులను క్రికెటర్లుగా చేయడంలో వారి తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంది. చాలా కష్టపడి.. ట్యాలెంట్ తో వెలుగు లోకి వచ్చిన ఆటగాళ్లలో పాండ్యా సోదరుల పేర్లు కూడా ఉంటాయి. ఒకానొక సమయంలో మ్యాగీ తిని మ్యాచ్ లు ఆడారు. పాండ్యా సోదరుల తండ్రి కూడా కొడుకులను క్రికెటర్లుగా చేయడానికి చాలానే కష్టపడ్డారు. సూరత్ లో కార్ ఫైనాన్స్ వ్యాపారం చేసే హిమాన్షు.. తన కుమారుల కెరీర్ కోసం ఆ వ్యాపారాన్ని వదిలేసి వడోదరకు మార్చాడు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో ఇద్దరినీ చేర్పించి శిక్షణ ఇప్పించాడు.
హిమాన్షు మరణంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆయనతో రెండుమూడు సార్లు మాట్లాడానని, ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నాడు కోహ్లీ. జీవితంలో అన్నీ సాధించిన భావన ఆయనలో కనిపించేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
హిమాన్షు పాండ్యా ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారని.. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. హార్ధిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తండ్రి మరణవార్త తెలిసిన కృణాల్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం పేర్కొంది. కృణాల్ నేతృత్వంలోని బరోడా జట్టు.. ఇప్పటివరకు ముస్తాక్ అలీ టోర్నీలో మూడు మ్యాచ్‌లను గెలిచింది. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ కోసం ప్రాక్టీసు చేస్తున్నాడు. హార్దిక్ ఆసీస్ సిరీస్ లో కూడా అద్భుతంగా ఆడాడు.

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మార్పు.. గంగూలీ చెప్పేశారు
5 hours ago

ప్రపంచంలోనే మేటి బౌలర్ బంతిని పంత్ అలా బాదేశాడే.. వాపోయిన రూట్
20 hours ago

టీమిండియా పై చస్తే బెట్ కట్టనంటున్న మైఖేల్ వాన్
08-03-2021

ఈ ఏడాది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!
07-03-2021

రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ సీరీస్‌ని మలుపు తిప్పింది.. కోహ్లీ
07-03-2021

ఏప్రిల్ 9 నుండే ఐపీఎల్ సందడి షురూ..!
07-03-2021

టీమిండియా ప్రతిభ అద్భుతం.. ఇంగ్లండ్ ఎత్తుగడలు ఘోరం... మాజీ క్రికెటర్ల వ్యాఖ్య
07-03-2021

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
06-03-2021

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
06-03-2021

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
06-03-2021
ఇంకా