newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

వామ్మో.. ఒకటే రోజే ఇంత టెన్షన్ పెట్టాలా..!

19-10-202019-10-2020 09:05:42 IST
Updated On 19-10-2020 10:05:01 ISTUpdated On 19-10-20202020-10-19T03:35:42.956Z19-10-2020 2020-10-19T03:35:39.208Z - 2020-10-19T04:35:01.333Z - 19-10-2020

వామ్మో.. ఒకటే రోజే ఇంత టెన్షన్ పెట్టాలా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆదివారం నాడు ఐపీఎల్ మ్యాచ్ లు అభిమానులకు అసలు సిసలు క్రికెట్ మజాను పంచాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు సూపర్ ఓవర్ ద్వారా ఫలితం రాగా..! ఆ తర్వాతి మ్యాచ్ ముంబై ఇండియన్స్-కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఏకంగా రెండు సూపర్ ఓవర్లు జరిగాయంటే క్రికెట్ అభిమానులను ఎంత టెన్షన్ పెట్టాయో అర్థం చేసుకోవచ్చు. 

అబుదాబిలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ తేలిపోయింది. అప్పటికే అద్భుతమైన బౌలింగ్ వేసిన లాకీ ఫెర్గుసన్ సూపర్ ఓవర్ లో కూడా శాసించాడు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ సూపర్ ఓవర్ లో 2 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది. సూపర్ ఓవర్ లో సన్ రైజర్స్ తరఫున వార్నర్, బెయిర్ స్టో బరిలో దిగారు. అయితే కోల్ కతా బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వార్నర్ ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సమద్ కూడా బౌల్డ్ కావడంతో 2 పరుగులే వచ్చాయి.కోల్ కతా తరఫున దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ సూపర్ ఓవర్ ఆడారు. సన్ రైజర్స్ తరఫున రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. ఎంత ప్రయత్నించినా కోల్ కతా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా  20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.  

ముంబై-పంజాబ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లోనూ టై కావడంతో మరో సూపర్ ఆడాల్సి వచ్చింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్ 53 (43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కృనాల్ పాండ్యా 34(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్), పొలార్డ్ 34(12 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లు), కౌల్టర్ నైల్ 24 (12 బంతుల్లో 4 ఫోర్లు) పరుగులు చేయడంతో ముంబై 176 పరుగుల స్కోరు చేసింది. 177 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 77 (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ గేల్ 24 (21 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు), పూరన్ 24 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా 23 (16 బంతుల్లో ఫోర్, సిక్సర్), క్రిస్ జోర్డాన్ 13 (8 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేశారు.

మ్యాచ్ టై కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేసింది. బుమ్రా మరో సంచలమైన ఓవర్ వేశాడు. షమీ అద్భుత బౌలింగుతో ముంబై ను మొదటి సూపర్ ఓవర్ లో విజయం సాధించకుండా అడ్డుకున్నాడు. తొలి 5 బంతుల్లో 4 పరుగులు రాగా, చివరి బంతికి ఒక పరుగు తీసి, రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో డికాక్ రన్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ మరోమారు టై అయింది.  ఫలితంగా విజేతను తేల్చేందుకు మరో సూపర్ ఓవర్ పెట్టారు. 

ముంబై పొలార్డ్, హార్దిక్ పాండ్యాలను బరిలోకి దింపింది. జోర్డాన్ కట్టుదిట్టమైన బౌలింగుకు దిగాడు. తొలి రెండు బంతులకు మూడు పరుగులు రాగా, మూడో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. నాలుగో బంతి వైడ్ కాగా,  ఆ తర్వాతి బంతికి పాండ్యా రనౌట్ అయ్యాడు. ఐదో బంతి డాట్ బాల్. చివరి బంతికి పొలార్డ్ రెండు పరుగులు చేయడంతో ముంబై వికెట్ నష్టానికి 11 పరుగులు మాత్రమే చేసింది. 12 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ మొదలుపెట్టగా..  గేల్‌, అగర్వాల్‌ క్రీజులోకి వచ్చారు. బౌల్ట్ వేసిన తొలి బంతినే గేల్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్ రాగా, మూడో బంతిని అగర్వాల్ బౌండరీకి పంపాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా, నాలుగో బంతిని అగర్వాల్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ పంజాబ్ గెలిచింది. పంజాబ్ ఎంతో సులువుగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో ఎన్నో ట్విస్ట్ లు సంభవించాయి. చివరికి రెండు సూపర్ ఓవర్లు జరిగాయి. ఎట్టకేలకు పంజాబ్ కు ఎంతో అవసరమైన 2 పాయింట్లు లభించాయి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle