newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్

29-09-202029-09-2020 14:15:25 IST
Updated On 29-09-2020 14:50:22 ISTUpdated On 29-09-20202020-09-29T08:45:25.751Z29-09-2020 2020-09-29T08:45:11.187Z - 2020-09-29T09:20:22.668Z - 29-09-2020

రైనా, హర్భజన్ పేర్లను తీసేసిన చెన్నై సూపర్ కింగ్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరుతో కాకుండా వివాదాల వల్లనే వార్తల్లో నిలుస్తోంది. సీజన్ మొదలవ్వగానే సురేష్ రైనా పేరు వార్తల్లో నిలిచింది. సురేష్ రైనా మొదట దుబాయ్ కు వెళ్లినప్పటికీ.. కొన్ని కారణాల వలన తిరిగి వచ్చేశాడు. సురేష్ రైనా.. చెన్నై జట్టు యాజమాన్యంతో గొడవ కారణంగానే దుబాయ్ నుండి ఉన్న పళంగా భారత్ కు వచ్చేశాడనే చర్చ కూడా జరిగింది.

ఆ తర్వాత సురేష్ రైనా మీద శ్రీనివాసన్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రైనా మాత్రం గొడవలేమీ లేవని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో సురేష్ రైనా మేనత్త కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురవ్వగా స్వదేశానికి తిరిగొచ్చాడు. తన మేనత్త కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని పంజాబ్ సీఎంను రైనా కోరాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసి నిందులను పట్టుకున్నారు.

ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందగా.. ఆ తర్వాత రెండు మ్యాచ్ లలోనూ ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులు సురేష్ రైనా జట్టు లోకి రావాలని సామాజిక మాధ్యమాల్లో కోరుతూ వస్తున్నారు. కానీ సురేష్ రైనా తిరిగి జట్టు లోకి వచ్చే సూచనలు కనిపించలేదు. 

ఇక హర్భజన్ సింగ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు దూరమయ్యాడు. మొదట భజ్జీ జట్టుతో కలిసి యుఏఈకి వెళ్ళలేదు. ఆలస్యంగా వెళతాడేమోనని భావించారు. కానీ తాను ఈ సీజన్ ఆడడం లేదని భజ్జీ స్టేట్మెంట్ ఇచ్చాడు. 

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సురేష్ రైనా, హర్భజన్ సింగ్ పేర్లను వెబ్సైట్ తొలగించింది. సురేశ్ రైనా పేరును చెన్నై సూపర్ కింగ్స్ తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. రైనా పేరుతో పాటు హర్భజన్ సింగ్ పేరును అఫీషియల్ వెబ్‌సైట్లో నుంచి తొలగించారు. దీంతో ఈ సీజన్లో రైనా జట్టులోకి తిరిగి రావడం లేదని చెన్నై జట్టు తేల్చేసింది. అభిమానులు కూడా రైనా రాక విషయంలో ఆశలు వదిలేసుకోవాల్సి ఉంటుంది. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle