టీమిండియాను.. ఇకెన్నడూ తక్కువగా అంచనా వేయం.. ఆసీస్ కోచ్ లాంగర్
20-01-202120-01-2021 10:55:41 IST
2021-01-20T05:25:41.257Z20-01-2021 2021-01-20T05:25:38.382Z - - 07-03-2021

చిత్తుగా ఓడిపోయాక తత్వం బోధపడటం అంటే ఏమిటో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌కి బాగానే అర్థమైనట్లుంది. అద్భుతం అనే పదానికే అద్భుతాన్ని నేర్పిస్తూ టీమిండియా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఓటమన్నదే ఎరుగని ఆసీస్ జట్టు బౌలర్లను అయిదోరోజు ఆటలో చితకబాది మరీ విజయనాదం చేసినప్పుడు కానీ ఆసీస్ కోచ్‌కి, ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లకు తమ కళ్లముందు ఏం జరుగుతోందో, జరిగిందో అర్థం కాలేదంటే అతిశయోక్తి కాదు. అందరికంటే ముందుగా మేల్కొన్నది ఆసీస్ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్. కోహ్లీ ఉన్నప్పుడే ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయని టీమిండియాను ఆతిథ్య జట్టు 4-0తో వైట్ వాష్ చేయడం ఖాయమని ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాళ్లు వరుసపెట్టి ప్రకటనలు చేసినప్పుడు నిజంగానే ఆసీస్ జట్టు ఉత్సాహంతో పొంగిపోయి ఉంటుంది. కానీ అజింక్యా రహానే సారధ్యంలో అద్భుతంగా కోలుకుని రెండో టెస్టును గెల్చుకున్న టీమిండియా మూడో టెస్టులో టెయిలెండర్ల అసాధారణమైన డిఫెన్స్ ఆటతో గర్వంగా డ్రా చేసుకోగలిగింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో అనితరసాధ్యం అనే రీతిలో చివరిరోజు 328 పరుగులు చేసి మరీ ఆసీస్ గర్వభంగం చేసిన టీమిండియాను ఆసీస్ జట్టు ప్రధాన కోచ్ మామూలుగా పొగడటం లేదు. అసాధారణం అనే ఒక్క మాటతో లాంగర్ టీమిండియా పోరాటానికి అద్దం పట్టాడు. నాలుగో టెస్టులో విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈరోజు భారత ఆటతీరు ఔట్ స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఈ ఓటమితో మాకు గుణపాఠం కలిగింది. 150 కోట్ల మంది బలమున్న టీమిండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదనేది ఈరోజే తెలిసొచ్చిందని లెంపలేసుకున్నాడు లాంగర్. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ టీమిండియా అద్బుత ప్రదర్శనతో 2-1 తేడాతో సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. ఏది ఏమైనా ఇండియా-ఆసీస్ టెస్టు సిరీస్ మాత్రం మరుపురానిదిగా నిలిచిందనడంలో సందేహం లేదు.. మ్యాచ్‌ల్లో గెలుపోటములు అనేవి సహజం.. ఈ విజయంతో టెస్టు క్రికెట్‌కున్న విలువేంటో మరోసారి కనిపించిందని లాంగర్ ముక్తాయించాడు. టీమిండియాకు రిషబ్ పంత్ లాంటి ఆటగాడు దొరకడం నిజంగా అదృష్టం.. అసలు ఏ మాత్రం భయం అనేది లేకుండా పంత్ సాగించిన ఇన్నింగ్స్ చూస్తే.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ హెడ్డింగేలో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చకునేలా చేసింది. శుబ్‌మన్ గిల్ కూడా మంచి బ్యాటింగ్ కనబరిచాడు. కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్‌కు టెస్టు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంది అని లాంగర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా యువ బౌలర్లు బంతులతో చేసిన దాడి మమ్మల్ని ఆట మొత్తంగా తీవ్రమైన ఒత్తిడికి గురిచేసింది. నిజంగానే భారత్ సీరీస్ గెలవడానికి అర్హురాలే అంటూ లాంగర్ ముగించాడు. లాంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీమిండియా మ్యాచ్ గెలిచాకా లాంగర్‌కు అసలు విషయం అర్థమయినట్లుంది అంటూ వ్యాఖ్యలు జతచేశారు. ఒకటి మాత్రం నిజం. బలమైన ఆసీస్ జట్టుతో పోలిస్తే ఎందుకూ కొరగానిదనిపించిన టీమిండియా గబ్బా స్టేడియంలో చేసిన ప్రదర్శన టెస్టు చరిత్రలో భారత్ సాధించిన అత్యుత్తమ విజయాల్లో అత్యుత్తమమైనదని ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు కొనియాడుతున్నారు.

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
15 hours ago

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
17 hours ago

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
20 hours ago

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
20 hours ago

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!
05-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
03-03-2021

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021
ఇంకా